AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather Report: ఏపీని వీడని వరుణుడు.. రేపు, ఎల్లుండి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు..

రుణుడు తెలుగు రాష్ట్రాలను వీడడం లేదు. ముఖ్యంగా భారీ వర్షాలు, వరదలతో నష్టపోయి ఇప్పుడిప్పుడే

AP Weather Report:  ఏపీని వీడని వరుణుడు.. రేపు, ఎల్లుండి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు..
Basha Shek
|

Updated on: Dec 02, 2021 | 9:16 AM

Share

ఆంధ్రప్రదేశ్ ను వరుణుడు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రతో పాటు  ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక ఈ అల్పపీడనం రేపటికి తుఫానుగా బలపడి ఆతర్వాత వాయువ్యదిశగా కదిలి డిసెంబరు 4న ఉదయం ఉత్తరాంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో 3, 4 తేదీల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అధికారుల అప్రమత్తం.. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. 5వ తేదీ వరకు మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని కోరుతున్నారు. ఇక రైతులు పంటలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also read:

Anantapuram Rains:అనంతపురం జిల్లాను వీడని వరద కష్టాలు.. ప్రాణాలకు తెగించి నది దాటి మృతదేహనికి అంత్యక్రియలు

Andhra Pradesh: రోడ్డుపై గుంతలతో వాహన దారుల ఇబ్బందులు.. స్వయంగా మరమ్మతులు చేసిన ఎమ్మెల్యే ముస్తఫా..

Andhra Pradesh: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం జగన్.. షెడ్యూల్ వివరాలివే..

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం