గ్రామ సచివాలయ ఉద్యోగులకు మరో అద్భుత అవకాశం..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలను అందించారు ఏపీ ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి.. అర్హులకు నియామక పత్రాలు అందించారు. జిల్లాల వారీగా.. అపాయింట్‌ మెంట్ లెటర్స్ ఇవ్వనున్న ఏపీ ఇన్‌ఛార్జ్ మంత్రులు. అలాగే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. ఉద్యోగులతో.. సీఎం జగన్.. మాట్లాడనున్నారు. అక్టోబర్ 2న తూర్పుగోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించనున్న సీఎం. కాగా.. గ్రామ సచివాలయ ఉద్యోగులకు మరో అద్భుత అవకాశం ఏంటంటే.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:11 am, Mon, 30 September 19
గ్రామ సచివాలయ ఉద్యోగులకు మరో అద్భుత అవకాశం..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలను అందించారు ఏపీ ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి.. అర్హులకు నియామక పత్రాలు అందించారు. జిల్లాల వారీగా.. అపాయింట్‌ మెంట్ లెటర్స్ ఇవ్వనున్న ఏపీ ఇన్‌ఛార్జ్ మంత్రులు. అలాగే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. ఉద్యోగులతో.. సీఎం జగన్.. మాట్లాడనున్నారు. అక్టోబర్ 2న తూర్పుగోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించనున్న సీఎం.

కాగా.. గ్రామ సచివాలయ ఉద్యోగులకు మరో అద్భుత అవకాశం ఏంటంటే.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప.. వేరే చోట పోస్టింగ్ ఇవ్వాలని.. ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఉద్యోగికి అనుకూలంగా.. కోరిక మేరకు సొంత జిల్లాలోనే.. వేరే మండలంలో కానీ.. గ్రామంలో కానీ.. జిల్లాలో మరెక్కడైనా.. కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వనున్నారు. పోస్టింగ్ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే.. ఒకవేళ ఒక పోస్టుకు ముగ్గురు ఉద్యోగులు పోటీ పడినప్పుడు.. వేరే గ్రామాల్లో.. రెండు, మూడు స్థానాల్లో అవకాశం కల్పించనున్నారు.

కాగా.. ఉద్యోగులకు ఈ పోస్టింగ్‌ని.. జిల్లా సెలక్షన్ కమిటీ ఇస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే.. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు.