AP Rains: వరద నీటిలో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు.. టాప్ ఎక్కి సహాయం కోసం ప్రయాణికుల ఆర్తనాదాలు..
కనీవినీ ఎరుగని జల ప్రళయం ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో కురుస్తోన్న
కనీవినీ ఎరుగని జల ప్రళయం ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తోంది. చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో కురుస్తోన్న కుండపోత వర్షాలు అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా భారీ వర్షాల ధాటికి వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలంలో చెయ్యేరు నది పోటెత్తింది. దీంతో రామాపురం రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. కాగా ఈ వరద నీటిలో రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో బస్సులు రహదారిపైనే ఆగిపోయాయి. రెండు బస్సుల్లో కలిసి సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వరద ప్రవాహం ఎక్కువ అవుతుండడంతో ప్రయాణికులు బస్ టాప్‌పైకి చేరుకుంటున్నారు. తమకు సహాయం చేయాలని అరుపులు, కేకలు వేస్తున్నారు.
కాగా భారీ వర్షాలు, వరదల కారణంగా కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ముఖ్యంగా నందలూరు, రాజంపేట మండలాల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. చెయ్యేరు నది పరిసర ప్రాంతాలు జగ దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాగా ఈ వరదల్లో చిక్కుకుని కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలు నందలూరు వద్ద లభ్యమయ్యాయి.
Also read:
AP Rains: ఏపీలో జల ప్రళయం.. కడప జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న 40మంది గల్లంతు
AP Rains: ఆ జిల్లాలకు ప్రత్యేక అధికారులు.. వారికి రూ.2వేలు తక్షణ సాయం: సీఎం జగన్
వరదలతో అతలాకుతలమవుతోన్న ఏపీ.. కొట్టుకుపోతున్న మూగ జీవాలు.. భయానక దృశ్యాలు..