AP Rains: ఏపీలో జల ప్రళయం.. కడప జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న 40మంది గల్లంతు

ఏపీని కనీవినీ ఎరుగని జల ప్రళయం అతలాకుతలం చేస్తోంది. ఇంతకు ముందెన్నడూ చూడని జల విలయం చుట్టుముట్టింది. ఎటుచూసినా జల బీభత్సం కనిపిస్తుంది.

AP Rains: ఏపీలో జల ప్రళయం.. కడప జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న 40మంది గల్లంతు
Ap Floods
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 19, 2021 | 11:28 AM

ఏపీని కనీవినీ ఎరుగని జల ప్రళయం అతలాకుతలం చేస్తోంది. ఇంతకు ముందెన్నడూ చూడని జల విలయం చుట్టుముట్టింది. ఎటుచూసినా జల బీభత్సం కనిపిస్తుంది. కడప జిల్లా రాజంపేట మండలంలో చెయ్యేరు నది పోటెత్తింది. వరద ఉధృతికి బస్సులో ప్రయాణిస్తున్న 40మంది కొట్టుకుపోయారు. అందరూ చూస్తుండగానే హాహాకారాలు చేస్తూ ప్రవాహంలో కొట్టుకుపోయారు. అలా కొట్టుకుపోయిన వాళ్ల జాడ గంటలు గడిచినా దొరకలేదు. ఇప్పుడు వాళ్లంతా ఏమైపోయారు. ఎక్కడైనా చిక్కుకుపోయారా అన్న అనుమానంతో అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. శివాలయంలో దీపారాధనకు భక్తులంతా బస్సులో వెళ్లారు. అయితే ఒక్కసారిగా వరద ఉదృతి పెరగడంతో బస్సు రహదారిపైనే ఆగిపోయింది. కొంతమంది కొట్టుకుపోగా మరికొందరు బస్సు రూఫ్‌ పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇప్పుడు వాళ్లంతా కాపాడమని అరుపులు, కేకలు పెడుతున్నారు. 40మంది గల్లంతయ్యారు. అయితే ముగ్గురి మృతదేహాలు మాత్రమే దొరికాయి. మిగతా వాళ్లంతా ఏమైపోయారన్నది తెలియాల్సి ఉంది.

అనంతపురంలో భారీగా వరద ప్రవాహం.. పొక్లెయిన్​​పైనే చిక్కుకుపోయిన 10 మంది

భారీవర్షాలకు చిత్రావతి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చెన్నెకొత్తపల్లి మండలం అమిదాలకుంటలో సమీపంలో కాజ్‌వేపై ఉధృతంగా ప్రవహిస్తోంది. నది దాటేందుకు వెళ్లిన కారు మధ్యలో చిక్కకుపోయింది. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు కేకలు వేశారు. ఐతే వారిని కాపాడేందుకు వెళ్లిన జేసీబీ కూడా నదిలో ఇరుక్కుపోయింది. దాంతో మొత్తం పది మంది నది మధ్యలో చిక్కుకుపోయారు.  నదిలో చిక్కుకుపోయిన వీరిని కాపాడేందుకు పోలీసులు, ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. కొట్టుకుపోతున్న జేసీబీని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు కూడా వారికి సహకరిస్తున్నారు.

Also Read: AP Rains: ఆ జిల్లాలకు ప్రత్యేక అధికారులు.. వారికి రూ.2వేలు తక్షణ సాయం: సీఎం జగన్

Hyderabad: 29 ఏళ్లకే గుండెపోటుతో యువ డాక్టర్ హఠాన్మరణం