Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: లోన్‌ యాప్స్‌ ఆగడాలపై ఏపీ పోలీసుల యాక్షన్‌.. యువతి సూసైడ్‌ కేసులో ఏడుగురు అరెస్ట్‌..

విజయవాడ మొగల్రాజపురంలోని ఓ బిల్డింగ్‌లో కాల్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి లోన్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట కేంద్రంగా ఈ రికవరీ ఏజెన్సీ నడుస్తోంది.

AP News: లోన్‌ యాప్స్‌ ఆగడాలపై ఏపీ పోలీసుల యాక్షన్‌.. యువతి సూసైడ్‌ కేసులో ఏడుగురు అరెస్ట్‌..
Loan Apps
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 02, 2022 | 5:14 AM

AP police action on loan apps: సంచలనం సృష్టించిన లోన్‌ యాప్‌ సూసైడ్‌ కేసులో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. హరిత ఆత్మహత్యకు రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని నిర్థారించిన పోలీసులు.. ముగ్గురు మేనేజర్లు, నలుగురు రికవరీ ఏజెంట్లను అరెస్ట్‌ చేశారు. వారంతా MSR, SLV ఏజెన్సీ ఉద్యోగులుగా తెలిపారు. ఈ ఏడుగురిలో పవన్‌, సాయి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. హరిత కుటుంబ సభ్యులను అవమానించినట్టు వాళ్లు విచారణలో ఒప్పుకున్నారు. విజయవాడ మొగల్రాజపురంలోని ఓ బిల్డింగ్‌లో కాల్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి లోన్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట కేంద్రంగా ఈ రికవరీ ఏజెన్సీ నడుస్తోంది. దాంతో, బేగంపేట మేనేజర్‌ మాధురిని కూడా విచారించారు. తమను దారుణంగా అవమానించారని, ఆ బాధను తట్టుకోలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని కన్నీళ్లు పెట్టుకుంది తల్లి. మీకు చదువులెందుకు గేదెలు కాచుకోమంటూ హేళన చేయడంతోనే సూసైడ్‌ చేసుకుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఆర్‌బీఐ గైడ్ లైన్స్ గైడ్‌లైన్స్‌ ప్రకారమే రికవరీ చేయాలి తప్ప.. వాళ్లను అవమానించడం లాంటివి చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే కఠినచర్యలు తప్పవంటూ లోన్ రికవరీ ఎజెంట్లను హెచ్చరించారు. లోన్‌ యాప్స్‌ ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోవడం, బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడంతో ఈ సమస్యపై సీరియస్‌గా దృష్టిపెట్టారు ఏపీ పోలీసులు. మరొకరు లోన్‌ యాప్స్‌ వేధింపులకు బలికాకుండా చర్యలు చేపడుతున్నారు. ఎవరైనాసరే ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారమే రికవరీ చేయాలని, అతిక్రమిస్తే సీరియస్‌ యాక్షన్ ఉంటుందని పోలీసులు స్పష్టంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
హీరో శర్వానంద్ ముద్దుల కూతురిని చూశారా? వీడియో ఇదిగో
హీరో శర్వానంద్ ముద్దుల కూతురిని చూశారా? వీడియో ఇదిగో
హాఫ్ సెంచరీతో చెలరేగిన లివింగ్ స్టోన్.. గుజరాత్‌ టార్గెట్ 170
హాఫ్ సెంచరీతో చెలరేగిన లివింగ్ స్టోన్.. గుజరాత్‌ టార్గెట్ 170
కాపీక్యాట్స్..! వెండితెర కంటే ముందే సెల్లుతెరపైకి మూవీ..
కాపీక్యాట్స్..! వెండితెర కంటే ముందే సెల్లుతెరపైకి మూవీ..
ఈ మొక్కను ఇంట్లో పెంచితే ధనప్రాప్తి ఖాయం!
ఈ మొక్కను ఇంట్లో పెంచితే ధనప్రాప్తి ఖాయం!