AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు.. నేటి నుంచే స్టార్ట్..

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. . 28 జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. ప్రశాంతంగా ఈ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేశారు.

AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు.. నేటి నుంచే స్టార్ట్..
Andhra Pradesh
Venkatrao Lella
|

Updated on: Oct 16, 2026 | 7:31 AM

Share

నేటి నుంచి ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగా.. 28 జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 100 పుర, నగరపాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేయగా.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారుల ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలకు పోటీకి అభ్యర్థులు సిద్దమవుతుండగా.. 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,485 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

గుర్తుల కేటాయింపుపై నోటిఫికేషన్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆధ్వర్యంలో ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీల ఉల్లంఘనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని  అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. గుర్తుల కేటాయింపుపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. గుర్తింపు పొందిన పార్టీలకి గతంలో కేటాయించిన గుర్తులు తిరిగి కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. అటు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసే అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితిని ఈసీ ఫిక్స్ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో ఉన్న నిబంధనలను సవరిసస్తూ కొత్త వ్యయ పరిమితులను నిర్ణయించారు. ఈ   నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించారు.

ఖర్చుల పరిమితులు ఇవే..

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాకి రూ. 40 లక్షల నిర్ణయించగా.. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్  కార్పొరేటర్ స్థానానికి రూ.15 లక్షలుగా ఉంది. ఇక ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానంలో రూ.25 లక్షలుగా ఉండగా.. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్ అభ్యర్ధికి: రూ.10 లక్షలుగా ఉంది. అలాగే మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అభ్యర్ధికి రూ.20 లక్షలు, మున్సిపాలిటీ వార్డు సభ్యుడు (కౌన్సిలర్)కు రూ.ఏడు లక్షల యాభై వేలు,  నగర పంచాయతీ చైర్‌పర్సన్‌కు రూ.10 లక్షలు, నగర పంచాయతీ వార్డు సభ్యుడుకి రూ.5 లక్షలుగా ఉంది.

Follow Us