AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. ఇక పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులకు 32 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్‌!

వచ్చే ఏడాది నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో కీలక మార్పులు చేయాలని ఇంటర్మీడియట్‌ విద్యామండలి నిర్ణయించింది. అన్ని సబ్జెక్టులకు 32 పేజీల సమాధానాల బుక్‌లెట్‌ అందించనున్నారు. ఒకేషనల్‌ కోర్సులకు 24 పేజీల బుక్‌లెట్‌ ఇవ్వనుండగా, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు కలిపి 40 పేజీల బుక్‌లెట్‌ అందించనున్నారు. ఇందులో పార్ట్‌-ఏ, పార్ట్‌-బీగా విభజించి సమాధానాలు రాయాల్సి ఉంటుంది..

ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. ఇక పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులకు 32 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్‌!
Booklets For All Inter Subjects
Srilakshmi C
|

Updated on: Oct 16, 2026 | 6:49 AM

Share

అమరావతి, అక్టోబర్ 16: ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కీలక మార్పు అమల్లోకి రానుంది. వచ్చే ఏడాది నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులకు 32 పేజీల సమాధానాల బుక్‌లెట్‌ అందించాలని ఏపీ ఇంటర్మీడియట్‌ విద్యామండలి నిర్ణయించింది. ఇప్పటివరకు భాషా సబ్జెక్టులకు 24 పేజీలు, గ్రూప్‌ సబ్జెక్టులకు 32 పేజీల బుక్‌లెట్లు అందిస్తున్నారు. తాజా నిర్ణయంతో భాషా సబ్జెక్టుల విద్యార్థులకు కూడా 32 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్‌ అందుబాటులోకి రానుంది.

ఒకేషనల్‌ విద్యార్థులకు 24 పేజీలు

ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు మాత్రం 24 పేజీల సమాధానాల బుక్‌లెట్‌ ఇవ్వనున్నారు. ఆయా కోర్సుల పరీక్షల అవసరాలకు అనుగుణంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పరీక్షల్లో సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు తగినన్ని పేజీలు అందుబాటులో ఉండేలా ఈ మార్పు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

బోటనీ, జువాలజీకి కలిపి 40 పేజీలు

జీవశాస్త్రం విద్యార్థుల కోసం కూడా కీలక మార్పు చేశారు. గతేడాది వృక్షశాస్త్రం (బోటనీ), జంతుశాస్త్రం (జువాలజీ) పరీక్షలకు విడివిడిగా 24 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్లు అందించారు. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ రెండు సబ్జెక్టులకు కలిపి 40 పేజీల సమాధానాల బుక్‌లెట్‌ ఇవ్వనున్నారు. ఈ బుక్‌లెట్‌లో పార్ట్‌-ఏ, పార్ట్‌-బీ అని విభజిస్తారు. వృక్షశాస్త్రం ప్రశ్నలకు ఒక భాగంలో, జంతుశాస్త్రం ప్రశ్నలకు మరో భాగంలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. దీంతో రెండు సబ్జెక్టులకు విడివిడిగా బుక్‌లెట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

ఇవి కూడా చదవండి

సమాధానాల బుక్‌లెట్లలో పేజీల సంఖ్యను మార్చడం వల్ల విద్యార్థులు తమ సమాధానాలను క్రమబద్ధంగా రాసేందుకు వీలవుతుంది. ముఖ్యంగా భాషా సబ్జెక్టులకు అదనంగా ఎనిమిది పేజీలు అందుబాటులోకి రానున్నాయి. జీవశాస్త్రంలో రెండు భాగాలకు ఒకే బుక్‌లెట్‌ ఇవ్వడం వల్ల సమాధాన పత్రాల నిర్వహణ కూడా సులభతరం కానుంది. వచ్చే ఏడాది ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని పరీక్షల ప్రణాళికను రూపొందించుకోవాలి. బుక్‌లెట్‌ పేజీలు పెరిగినప్పటికీ, సమాధానాలను ప్రశ్నకు అనుగుణంగా, స్పష్టంగా, నిర్ణీత సమయంలో రాయడంపై దృష్టి పెట్టాలి.

Follow Us
ఇక నీళ్లు వృథా చేసే వారికి దబిడి దిబిడే..
ఇక నీళ్లు వృథా చేసే వారికి దబిడి దిబిడే..
ఇరాన్ నావికుల హైజాక్.. భారత నేవీ ఎంట్రీతో సోమాలియా దొంగలు పరార్!
ఇరాన్ నావికుల హైజాక్.. భారత నేవీ ఎంట్రీతో సోమాలియా దొంగలు పరార్!
దీపావళి పండుగ స్పెషల్.. నేతి బొబ్బట్లు మీ ఇంట్లోనే ఇలా నిముషాల్లో
దీపావళి పండుగ స్పెషల్.. నేతి బొబ్బట్లు మీ ఇంట్లోనే ఇలా నిముషాల్లో
పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు కొనాలా లేదా వేచి చూడాలా?
పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు కొనాలా లేదా వేచి చూడాలా?
సిల్క్ స్మిత చనిపోయినప్పుడు ఆ ఒక్క హీరో మాత్రమే వచ్చాడు
సిల్క్ స్మిత చనిపోయినప్పుడు ఆ ఒక్క హీరో మాత్రమే వచ్చాడు
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్
వెల్లుల్లి, ఉల్లిపాయలు తింటున్నారా? రాహు కేతువుల ప్రభావం ఉంటుందా?
వెల్లుల్లి, ఉల్లిపాయలు తింటున్నారా? రాహు కేతువుల ప్రభావం ఉంటుందా?
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. భర్తగా రావడం అదృష్టమేనట..!
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. భర్తగా రావడం అదృష్టమేనట..!
యువ నేత సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్.. బోణీ కొట్టిన వైసీపీ
యువ నేత సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్.. బోణీ కొట్టిన వైసీపీ
బిర్యానీ అసలు ఎక్కడ పుట్టింది.. చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు
బిర్యానీ అసలు ఎక్కడ పుట్టింది.. చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు