AP MLC Election: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను వైసీపీ ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్ణయం మేరకు ముగ్గురు అభ్యర్ధులను వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సజ్జల ప్రకటించారు.
YCP MLA Quota MLC Candidates: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను వైసీపీ ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు ముగ్గురు అభ్యర్ధులను వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లా నుంచి ఇషాక్ బాషా, కడప జిల్లా నుంచి డీసీ గోవింద్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు సజ్జల తెలిపారు. పాలవలస విక్రాంత్, ఇషాక్ బాషాకు కొత్తగా అవకాశం కల్పించిన పార్టీ… తాజాగా మాజీ అయిన డీసీ గోవింద్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించింది.
ఇదిలావుంటే, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు గానూ MLC కోటాలో 3 ఖాళీలు.. ఉండగా, స్థానిక సంస్థల కోటాలో 11 ఖాళీలు.. ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు మొదలుపెట్టింది. అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో YCPదే పూర్తి మెజార్టీ ఉండటంతో ఈ 14 స్థానాల్లోనూ విజయం నల్లేరుపై నడకే అని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. దాదాపు అన్ని కూడా ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అందుకే క్యాండిడేట్ల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది హైకమాండ్. అన్ని ఈక్వేషన్స్‌ను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోటాలో ముగ్గురి పేర్లను ఖరారు చేసింది. మిగిలిన స్థానిక సంస్థల కోటాలోని 11 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల కోసం పార్టీ అధినేత కసరత్తు చేస్తున్నట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.