Minister Roja: కేసీఆర్‌ను కలిసి వచ్చి.. కేటీఆర్‌కు ఏపీ మంత్రి రోజా కౌంటర్

ఏపీలో కరెంట్ పరిస్థితులపై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు వైసీపీ నేతలు, ఏపీ మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. తగ్గేదే లే అన్నట్టుగా టీఆర్‌ఎస్ నేతలు స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు.

Minister Roja: కేసీఆర్‌ను కలిసి వచ్చి.. కేటీఆర్‌కు ఏపీ మంత్రి రోజా కౌంటర్
Roja
Follow us

|

Updated on: Apr 29, 2022 | 6:33 PM

ఏపీ(Ap)లో అభివృద్ధిపై కామెంట్లు చేసిన KTR డేట్‌, టైమ్‌ ఇస్తే రాష్ట్రమంతా తిప్పి చూపిస్తానని కౌంటర్‌ ఇచ్చారు మంత్రి రోజా. స్కూల్స్, హాస్పిటల్స్ ఎలా మెరుగుచేశామో చూపిస్తానన్నారు. పలు రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.  KTR వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానన్నారు. వచ్చి చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందన్నారు రోజా. ఏపీ వచ్చి చూస్తే కేటీఆర్ కూడా తన మనసు మార్చుకుని.. అలా అభివృద్ది చేయాలని అనుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమ్మర్ కారణంగా తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నాయన్నారు. కొద్దిసేపటి కిందట ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రగతిభవన్‌కు వెళ్లి ఆయనతో మాట్లాడారు. బయటకు వచ్చి కేటీఆర్‌ వ్యాఖ్యలపై రియాక్ట్‌ అయ్యారు.

పరోక్షంగా APలో పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక విధంగా ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయి. క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య మాటలయుద్ధానికి తెరతీసింది. అయితే ముందు మీ రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుని తర్వాత మిగతావారిపై కామెంట్‌ చేయాలని సూచించారు ఏపీ మంత్రులు. ఏపీలో పాలన దేశానికే ఆదర్శంగా ఉందన్నారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన రోజా

ఇటీవల మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజా ప్రముఖులను కలుస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కె. చంద్ర శేఖర్ రావును ప్రగతి భవన్ లో కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సీఎం కేసిఆర్‌కు చిత్రపటాన్ని బహూకరించారు. రోజాకు సీఎం కేసిఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత సంప్రదాయ పద్దతిలో బొట్టుపెట్టి సత్కరించారు.

Roja 1

Roja 2

Also Read: Viral Video: యమపాశంలా దూసుకువచ్చిన బండ రాయి.. క్షణకాలంలో ఊహించని విషాదం..