అమరావతి, జులై 17: రాష్ట్రంలోని పలు బోధనాసుపత్రుల్లో 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 44 స్పెషాలిటీ, సపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ విధానాల్లో ఈ నియామకాలు చేపట్టనుంది. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం సోమవారం (జులై 17) నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు జులై 26వ తేదీ గడువు.
జనరల్ అభ్యర్ధులు రూ.వెయ్యి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యఎస్, వికలాంగ అభ్యర్థులు రూ.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 5 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటితోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన కడప మానసిక ఆస్పత్రి, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, పలు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ వైద్య పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటి వరకు 50 వేలకుపైగా పోస్టులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.