AP Inter Supplementary Results: నేడు ఇంటర్మీడియట్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి

ఏపీలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌  సప్లిమెంటరీ పరీక్షలు రాసినవారికి అలెర్ట్. నేడు ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

AP Inter Supplementary Results: నేడు ఇంటర్మీడియట్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి
Ap Inter Supplementary Exam
Follow us

|

Updated on: Oct 23, 2021 | 8:11 AM

ఏపీలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసినవారికి అలెర్ట్. నేడు(శనివారం) సాయంత్రం 5గంటలకు మొదటి, రెండు సంవత్సరాల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రిజల్ట్స్‌ను విడుదల చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రయోగాత్మకంగా వృత్తి విద్య, కొన్ని మైనర్‌ సబ్జెక్టులను ఆన్‌లైన్‌(ఆన్‌ స్క్రీన్‌)లో మూల్యాంకనం చేశారు. ఈ నెల 26 నుంచి నవంబరు 2 వరకు సమాధాన పత్రాల రీ వాల్యూవేషన్, పరిశీలనకు అవకాశం ఉంటుందని వివరించారు. రీ వాల్యూవేషన్ కోసం పేపర్‌కు రూ.260, స్కాన్‌కాపీ, పునఃపరిశీలనకు పేపర్‌కు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. స్కానింగ్‌ ఆన్సర్ షీట్స్ కూడా ఆన్‌లైన్‌లోనే అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ఏడాది ఎగ్జామ్స్‌కు జనరల్‌, వృత్తి విద్య విద్యార్థులు 3,24,800 మంది, రెండో ఏడాది పరీక్షలకు సాధారణ, వృత్తి విద్య కలిపి 14,950 మంది అటెండ్ అయ్యారు.

ఫలితాలను http://bie.ap.gov.in, http://examresults.ap.nic.in, http://results.apcfss.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. షార్ట్‌ మెమోలను ఈ నెల 25న సాయంత్రం 5 గంటల నుంచి bie.ap.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కోవిడ్‌ కారణంగా పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం, విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేసింది.వారికి మరింత మేలు చేకూర్చేలా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహించింది. విద్యార్థుల భవిష్యత్‌ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పరీక్షల సమయంలో ప్రతీ కేంద్రంలో థర్మల్‌ స్క్రీనింగ్, విద్యార్థులంతా మాస్కులు ధరించేలా జాగ్రత్తల పాటించారు. కోవిడ్‌ అనుమానితుల కోసమని ప్రత్యేకంగా కేంద్రాల్లో ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన లభించింది.

Also Read: Cheating: రాగి చెంబుకు పూత పూసి పంగనామం.. కొంప కొల్లేరు

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?