ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ ఫీజులన్నీ రద్దు చేసిన ప్రభుత్వం.. ఎక్కడంటే ?..
కరోనా మహమ్మారి దేశంలో అందరిని ఆర్థికంగా భారీగా దెబ్బతీసింది. లాక్డౌన్ ప్రభావంతో మధ్య, పేద తరగతి ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.

btech students

ఈ సంవత్సరం ఇంటర్ అడ్మిషన్స్ సహా పలు రకాల ఫీజులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రీఅడ్మిషన్స్, భాష, మీడియం మార్పులు, గ్రూప్ మార్పులు చేసుకునేందుకు వసూలు చేసే వివిధ రకాల ఫీజులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వీటికి సంబంధించిన ఫీజులను వసూలు చేయకూడదని రాష్ట్రంలోని కాలేజ్ ప్రిన్సిపాళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. ఫీజు వసూలు విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఎలాంటి ఒత్తిడిలకు గురిచేయకూడదని స్పష్టం చేసింది.