AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Breaking: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల రద్దు.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల రద్దు చేస్తూ.. ఏపీ హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని....

Big Breaking: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల రద్దు..  కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
Ap High Court
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 21, 2021 | 12:11 PM

Share

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల రద్దు చేస్తూ.. ఏపీ హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిషత్‌ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని న్యాయస్థానం పేర్కొంది. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించలేద‌ని హైకోర్టు పేర్కొంది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను స‌వాల్ చేస్తూ టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కోర్టును ఆశ్ర‌యించాయి. మోడ‌ల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ ను ఫాలో కాకుండా ఎన్నిక‌లు జ‌రిగాయ‌న్న ప్ర‌తిప‌క్ష‌ల వాద‌న‌కు హైకోర్టు మొగ్గుచూపింది. అయితే, ఈ తీర్పుపై ఏపీ ప్ర‌భుత్వం డివిజ‌న్ బెంచ్ లో కానీ, సుప్రీం కోర్టులో కానీ స‌వాల్ చేసే యోచ‌న‌లో ఉంది.

ఇదీ జ‌రిగింది…..

పోలింగ్ తేదీకి 4వారాల ముందు ఎల‌క్ష‌న్ కోడ్‌ విధించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి .. ఏప్రిల్ 8 న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6 వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఎస్.ఈ.సీ అప్పీల్ దాఖలు చేయగా ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి..లెక్కింపు ప్రక్రియ నిలుపుదల చేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిందిగా సింగిల్‌ జడ్జికి హైకోర్టు అప్పగించింది. దీంతోపాటు జనసేన, బీజేపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపైనా సింగిల్ జడ్జి ఈనెల 4 న విచారణ జరిపి తీర్పును రిజర్వు చేశారు. తాజాగా న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి ఎన్నిక‌లు ర‌ద్దు చేస్తూ.. తీర్పు వెలువ‌రించారు.

ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు…హైకోర్టు సంచలన తీర్పు – Watch Live

Also Read: కృష్ణా జిల్లా పెడనలో విషాదం.. కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య

దేశంలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా యాక్టివ్ కేసులు.. ప్ర‌మాద‌క‌రంగానే మ‌ర‌ణాలు

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్