AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జగన్‌ పాలనలో మద్యం అమ్మకాలు పెరిగాయా? ఇందులో నిజమెంత? వివరణ ఇచ్చిన ప్రభుత్వం

జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు మద్య పాన నిషేధం హామీ ఇచ్చిన జగన్‌ తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం దానిని పక్కన పెట్టేశారని విమర్శలు గుప్పిస్తున్నాయి. పైగా ఎన్నడూ

Andhra Pradesh: జగన్‌ పాలనలో మద్యం అమ్మకాలు పెరిగాయా?  ఇందులో నిజమెంత? వివరణ ఇచ్చిన ప్రభుత్వం
Cm Jagan
Basha Shek
|

Updated on: Apr 05, 2023 | 5:30 AM

Share

జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని విపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు మద్య పాన నిషేధం హామీ ఇచ్చిన జగన్‌ తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం దానిని పక్కన పెట్టేశారని విమర్శలు గుప్పిస్తున్నాయి. పైగా ఎన్నడూ లేనంతగా ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయంటూ జగన్‌ సర్కారును ఎండగడుతున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం మద్యం అమ్మకాలపై FACT CHECK విడుదల చేసింది. జగన్‌ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగిపోయాయంటూ కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు అవాస్తవమని గణాంకాలతో సహా వివరించింది.  ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఐఎంఎల్ (మద్యం) విక్రయాలు, బీరు విక్రయాలు ఎలా వున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ఐఎంఎల్ (మద్యం) విక్రయాలు, బీరు విక్రయాలు ఎలా వున్నాయో గణాంకాల రూపంలో వాస్తవాలను విడుదలచేసింది ప్రభుత్వం. ‘ఈ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగిపోయాయంటూ కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు అవాస్తవం. నిజానికి 2014–2019 మధ్యే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. ఈ కింది టేబుళ్లే అందుకు నిదర్శనం.’

మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నాం..

‘ ఈ ప్రభుత్వం దశలవారీగా మద్య నియంత్రణకు కట్టుబడి ఉంది. అందుకే షాక్‌ కొట్టేలా ధరలు పెంచింది. మద్యంపై అదనపు పన్ను విధించింది. ఫలితంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మద్యం విక్రయాలు సగటున 30 శాతం, బీరు విక్రయాలు సగటున 57 శాతం తగ్గాయి’ అని అందులో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us