Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన సజ్జల రామకృష్ణ రెడ్డి.. ఏమన్నారంటే ?

ఏపీలోని నంద్యాలలో చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. అయితే దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడిపై బలమైన సాక్ష్యాలు చేతిలో ఉన్న తర్వాతే సీఐడీ పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేకుండా ఈ అరెస్టు జరిగినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో బోగస్ కంపెనీలను సృష్టించి ప్రభుత్వం సొమ్మును అడ్డగోలగా దోచిపెట్టారని అన్నారు. రెండు సంవత్సరాల క్రితమే సీఐడీ ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Andhra Pradesh: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన సజ్జల రామకృష్ణ రెడ్డి.. ఏమన్నారంటే ?
Sajjala Rama Krishna Reddy
Follow us
Aravind B

|

Updated on: Sep 09, 2023 | 12:58 PM

ఏపీలోని నంద్యాలలో చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. అయితే దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడిపై బలమైన సాక్ష్యాలు చేతిలో ఉన్న తర్వాతే సీఐడీ పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేకుండా ఈ అరెస్టు జరిగినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో బోగస్ కంపెనీలను సృష్టించి ప్రభుత్వం సొమ్మును అడ్డగోలుగా దోచిపెట్టారని అన్నారు. రెండు సంవత్సరాల క్రితమే సీఐడీ ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఈ అరెస్టు జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు అంటున్నారని అన్నారు. కానీ 2017,2018లోనే పూణెలో జీఎస్డీ విచారణలో షెల్ కంపెనీలకు సొమ్ము మళ్లించినట్లు అధికారులు అప్పుడే గుర్తించారని అన్నారు.

వాస్తవానికి ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు నాయుడి పేరు పెట్టకపోవడం అంటే అక్కడే సీఎం జగన్ ప్రభుత్వం నిజాయతీ కనిపిస్తుందని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెండు ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవని అన్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత విచారణ చేశాకే కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అవినీతి జరగలేదని చంద్రబాబు నిరూపించుకోవాలని అన్నారు.

ఇవి కూడా చదవండి