Janasena: వైసీపీ ప్రభుత్వంపై జనసేన నేతల కామెంట్స్ కలకలం.. విద్యార్థుల మృతిపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్
వైసీపీ పాలనలో 62వేల 754 మంది పాఠశాల విద్యార్థులు చనిపోయారంటూ జనసేన పార్టీ కీలక నేత నాదండ్ల నాదెండ్ల మనోహర్ కామెంట్ చేశారు. పాఠశాల విద్యార్థులు మరణించినట్టు జీఈఆర్ సర్వేలో తేలిందని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన జీఈఆర్ సర్వే వివరాలను గుంటూరు జిల్లా తెనాలిలో వెల్లడించారు.
మొన్న మహిళల మిస్సింగ్.. ఇప్పడు విద్యార్థుల మృతి.. ఘటనలు ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తున్నాయి. తాజాగా వైసీపీ పాలనలో 62వేల మంది విద్యార్థులు చనిపోయారంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. అవును ఏపీలో పరిస్థితి ఇదంటూ మరోసారి జనసేన నేతల కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న 30వేల మందికి పైగా మహిళలు మిస్సయ్యారంటూ ఆరోపించిన జనసేన మరోసారి.. విద్యార్థుల మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో 62వేల 754 మంది పాఠశాల విద్యార్థులు చనిపోయారంటూ జనసేన పార్టీ కీలక నేత నాదండ్ల నాదెండ్ల మనోహర్ కామెంట్ చేశారు. పాఠశాల విద్యార్థులు మరణించినట్టు జీఈఆర్ సర్వేలో తేలిందని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన జీఈఆర్ సర్వే వివరాలను గుంటూరు జిల్లా తెనాలిలో వెల్లడించారు. సర్వేలో వెల్లడైన అంశాలు వైసీపీ ప్రభుత్వ అసమర్థతను తేటతెల్లం చేసేలా ఉన్నాయన్నారు.
అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో, ఆ తర్వాత అనంతపురం, గుంటూరు జిల్లాల్లో విద్యార్థులు ఎక్కువ మంది చనిపోయినట్టు జీఈఆర్ సర్వేలోనే తేలిందన్నారు. పాఠశాల విద్యార్థులు చనిపోవటం ఎంతగానో కలిచివేస్తుందన్నారు. ఇంత ప్రధానమైన అంశంపై ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవటం లేదు.. సర్వే వివరాల్ని ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
వైసీపీ పాలనలో ఏపీలో ఇప్పటి వరకూ 3.88 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి డ్రాపౌట్ అయ్యారని, 2.29 లక్షల మంది విద్యార్థులు కనిపించడం లేదని సర్వేలో తేలిందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. నాడు-నేడు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజన పథకం, వసతి దీవెన, విద్యా దీవెన పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయో ప్రభుత్వం చెప్పాలన్నారు. పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్ వహిస్తూ సర్వే రిపోర్ట్ పై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..