AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆధార్, రేషన్ కార్డు రెండూ ఉన్నాయా..? ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. ఏపీ ప్రభుత్వం పెద్ద ఊరట..

ఏపీ ప్రభుత్వం రెసిడెన్షియల్ సర్టిఫికేట్లకు సంబంధించి కీలక మార్పులు చేసింది. ఇటీవల తహసీల్దార్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు మళ్లీ సవరణలు చేసింది. నిర్దిష్టమైన అవసరాలకు మాత్రమే ఈ సర్టిఫికేట్లు జారీ చేయాలని సూచించింది. మిగతా అవసరాలకు ఆధార్, రేషన్ నివాస రుజువుగా ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.

Andhra Pradesh: ఆధార్, రేషన్ కార్డు రెండూ ఉన్నాయా..? ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. ఏపీ ప్రభుత్వం పెద్ద ఊరట..
Ration Card
Venkatrao Lella
|

Updated on: Sep 18, 2026 | 7:40 AM

Share

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డ్, రేషన్‌ కార్డుకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది. ఇక నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీ, సేవలతో పాటు ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఈ రెండు గుర్తింపు ధృవీకరణ పత్రాలను నివాస రుజువుగా ఉపయోగించుకోవాలని సూచించింది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్‌కు సంబంధించి బుధవారం ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సర్టిఫికేట్లను జారీ చేసే బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించింది. గతంలో తహసీల్దార్లను ఆ బాధ్యతల నుంచి తప్పించగా.. ఇప్పుడు మళ్లీ వారికి అధికారం అప్పగించింది. అయితే ఇప్పుడు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది.

కేవలం ఆదివాసీ గిరిజనులకు ఆధార్ నమోదు, ఆధార్ అప్డేట్ కోసం తహసీల్దార్లు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ జారీ చేయాలని ప్రభుత్వం తెలిపింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, సైనిక దళాల రిక్రూట్‌మెంట్ అవసరాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అవసరం కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్ అందించాలని ఆదేశించింది. మిగతా పనులకు ఆధార్, రేషన్ నివాస రుజువుగా సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది. కేవలం నిర్దిష్ట అవసరాలకు మాత్రమే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ జారీ చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాజాజా సీఎస్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటికే సర్టిఫికేట్లు జారీ చేసి ఉంటే మళ్లీ కొత్తగా అవసరం లేదని స్పష్టం చేసింది.

రెసిడెన్షియల్ సర్టిఫికేట్ల జారీని తహసీల్దార్‌కు అప్పగిస్తూ జీవో నెంబర్ 592ను ప్రభుత్వం విడుదల చేసింది. 2015లో తెచ్చిన జీవో 581ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి తహసీల్దార్‌కు రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారాన్ని అప్పగించింది. ఇక నుంచి ఎవరికైనా నివాస ధృవీకరణ పత్రం అవసరమైతే తహసీల్దార్‌కు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. తహసీల్దార్ డాక్యుమెంట్లు పరిశీలించి సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఒకవేళ సరైన ఆధారాలు లేకపోతే స్థానికంగా విచారణ జరిపిన అనంతరం రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఏపీలో సర్ ప్రక్రియ ముగియడం, రేషన్, ఆధార్ కార్డు ఆధారంగా నివాస రుజువును ధృవీకరిస్తున్న తరుణంలో రెసిడెన్స్ సర్టిఫికేట్లతో పని లేకుండా పోయింది. ఇప్పుడు ఆ బాధ్యతలను తిరిగి తహసీల్దార్లకు అప్పగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మళ్లీ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందేమోని భయపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆధార్, రేషన్ కార్డును నివాస రుజువుగా ఉపయోగించుకోవచ్చని ప్రకటన చేయడంతో ఊరట చెందుతున్నారు.

Follow Us
ఆధార్, రేషన్ కార్డు ఉన్నాయా..? ఏపీ ప్రభుత్వం బిగ్ రిలీఫ్..
ఆధార్, రేషన్ కార్డు ఉన్నాయా..? ఏపీ ప్రభుత్వం బిగ్ రిలీఫ్..
ఐటీ హబ్‌లో అర్థరాత్రి కొండచిలువ హల్చల్.. యువకుడి ఏం చేశాడో చూడండి
ఐటీ హబ్‌లో అర్థరాత్రి కొండచిలువ హల్చల్.. యువకుడి ఏం చేశాడో చూడండి
ఎర్రవల్లి భూములపై సర్కార్ నజర్.. రికార్డుల వేటలో అధికారులు..
ఎర్రవల్లి భూములపై సర్కార్ నజర్.. రికార్డుల వేటలో అధికారులు..
భారత్, జపాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. రద్దయితే సెమీస్ చేరేదెవరు?
భారత్, జపాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. రద్దయితే సెమీస్ చేరేదెవరు?
యూట్యూబర్‌ వైష్ణవి భర్తను హత్య చేసింది నేనే.. సెల్ఫీ వీడియో కలకలం
యూట్యూబర్‌ వైష్ణవి భర్తను హత్య చేసింది నేనే.. సెల్ఫీ వీడియో కలకలం
ఛీ.. ఛీ మరీ ఇంత దారుణమా?.. మొబైల్ EMI కట్టలేదని..
ఛీ.. ఛీ మరీ ఇంత దారుణమా?.. మొబైల్ EMI కట్టలేదని..
యూపీఐ వాడుతున్నారా..? ఈ 7 లావాదేవీలు పూర్తిగా ఫ్రీ..
యూపీఐ వాడుతున్నారా..? ఈ 7 లావాదేవీలు పూర్తిగా ఫ్రీ..
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? UPSCలో 127 కొలువులు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? UPSCలో 127 కొలువులు
ఆ ముగ్గురికి అర్హత లేనేలేదు.. అయినా వన్డే స్క్వాడ్‌లో ఛాన్స్..!
ఆ ముగ్గురికి అర్హత లేనేలేదు.. అయినా వన్డే స్క్వాడ్‌లో ఛాన్స్..!