Viral Video: ఐటీ హబ్‌లో అర్థరాత్రి కొండచిలువ హల్చల్.. యువకుడి ఏం చేశాడో చూడండి..
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ప్రాంతంలో ఓ కొండచిలువ హల్చల్ చేసింది. ఐటీ కంపెనీలకు కూతవేటు దూరంలోనే భారీ కొండచిలువ కనిపించడంతో ఉద్యోగులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సాధారణంగా చెట్ల పొదలు, కొండ ప్రాంతాల్లో కనిపించే కొండచిలువ.. ఇప్పుడు ఏకంగా ఐటీ కంపెనీల పరిసరాల్లోకి రావడంతో అక్కడి పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ప్రాంతాల్లో ఓ భారీ కొండచిలువ హల్చల్ చేసింది. దుర్గం చెరువు చుట్టుపక్కల కొండలు, గుట్టలు తొలగించడం, నిర్మాణాలు పెరగడం వల్ల వన్యప్రాణులు, సరీసృపాలు జనావాస ప్రాంతాల వైపు వస్తున్నాయి. తాజాగా ఐటీ కంపెనీ ముందు కొండచిలువ కనిపించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొందరు వాహనాలను ఆపి దూరంగా వెళ్లగా, మరికొందరు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే పరిస్థితిని గమనించిన ఓ ఐటీ ఉద్యోగి ధైర్యంగా ముందుకు వెళ్లి కొండచిలువను పట్టుకున్నట్లు సమాచారం.
గతంలో కొండలు, గుట్టలు, చెట్లతో ఉన్న దుర్గం చెరువు పరిసరాలు ఇప్పుడు భారీ నిర్మాణాలతో ఐటీ హబ్‌గా మారిపోయాయి. దీంతో సహజ ఆవాసాలు తగ్గిపోవడంతో కొండచిలువలు, ఇతర సరీసృపాలు బయటకు వచ్చి రోడ్లు, కంపెనీల పరిసరాల్లోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా కేబుల్ పిట్స్, పైప్‌లైన్లు, ఖాళీ ప్రదేశాలు, నిర్మాణ ప్రాంతాల్లో సరీసృపాలు దాక్కునే అవకాశం ఉండటంతో ఐటీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే కొండచిలువలు సాధారణంగా మనుషులను వెంబడించి దాడి చేసే స్వభావం కలిగినవి కావని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇలాంటి సరీసృపాలు కనిపించినప్పుడు వాటిని దగ్గరగా వెళ్లి పట్టుకునే ప్రయత్నం చేయకుండా సంబంధిత సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
