AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? UPSCలో 127 కొలువులకు నోటిఫికేషన్‌.. అప్లికేషన్‌ డెడ్‌లైన్‌ ఇదే

జియాలజీ, జియోఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర సంబంధిత విభాగాల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన అభ్యర్థులకు UPSC నుంచి భారీ నోటిఫికేషన్‌ విడుదలైంది. కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్‌ 2027 ద్వారా GSI, CGWBలో గ్రూప్‌ A, గ్రూప్‌ B పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 22, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? UPSCలో 127 కొలువులకు నోటిఫికేషన్‌.. అప్లికేషన్‌ డెడ్‌లైన్‌ ఇదే
UPSC Combined Geo-Scientist Notification
Srilakshmi C
|

Updated on: Sep 18, 2026 | 6:49 AM

Share

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2027 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (CGWB)లో గ్రూప్‌ A, గ్రూప్‌ B పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 127 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 22, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు..

కేటగిరీ వారీగా పోస్టుల వివరాలు..

కేటగిరీ I జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI)లో మొత్తం 111 పోస్టులు ఉన్నాయి. ఇందులో..

  • జియాలజిస్ట్, గ్రూప్‌-A పోస్టుల సంఖ్య: 29
  • కెమిస్ట్, గ్రూప్‌-A పోస్టుల సంఖ్య: 7
  • అసిస్టెంట్ జియాలజిస్ట్, గ్రూప్‌-B పోస్టుల సంఖ్య: 34
  • అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్, గ్రూప్‌-B పోస్టుల సంఖ్య: 35
  • అసిస్టెంట్ కెమిస్ట్, గ్రూప్‌-B పోస్టుల సంఖ్య: 6

కేటగిరీ-II సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (CGWB)లో మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. ఇందులో..

  • సైంటిస్ట్‌-B (హైడ్రోజియాలజీ), గ్రూప్‌-A పోస్టుల సంఖ్య: 5
  • సైంటిస్ట్‌-B (కెమికల్), గ్రూప్‌-A పోస్టుల సంఖ్య: 1
  • సైంటిస్ట్‌-B (జియోఫిజిక్స్), గ్రూప్‌-A పోస్టుల సంఖ్య: 1
  • అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్, గ్రూప్‌-B పోస్టుల సంఖ్య: 7
  • అసిస్టెంట్ కెమిస్ట్, గ్రూప్‌-B పోస్టుల సంఖ్య: 1
  • అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్, గ్రూప్‌-B పోస్టుల సంఖ్య: 1

పోస్టును బట్టి అభ్యర్థులు సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి. జియాలజీ, అప్లైడ్ జియాలజీ, జియోఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, హైడ్రోజియాలజీ తదితర సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2027 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 22, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ పురుష అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష – ఆబ్జెక్టివ్‌ టైప్‌, 400 మార్కులు, మెయిన్స్ పరీక్ష – డిస్క్రిప్టివ్‌/రాత పరీక్ష, 600 మార్కులు, పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ – 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాలకు 1/3 వంతు చొప్పున కోత విధిస్తారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 22, 2026.
  • ప్రిలిమినరీ పరీక్ష: జనవరి 10, 2027.
  • మెయిన్స్ పరీక్ష: 19, 20 జూన్‌ 2027 తేదీల్లో

యూపీఎస్సీ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2027 ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us