AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: యూపీఐ వాడేవారికి కేంద్రం శుభవార్త.. ఈ ఏడు లావాదేవీలు పూర్తిగా ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు ఉండవ్..

యూపీఐ లాావాదేవీలపై కేంద్రం ఛార్జీలు విధించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో సామాన్యుల్లో ఆందోళన నెలకొంది. వచ్చే నెల 15వ తేదీ నుంచి వీటిని వర్తింపచేయనున్నారు. అయితే ఏడు రకాల లావాదేవీలు మాత్రం ఇప్పటికీ ఉచితంగా చేసుకోవచ్చు. వీటిపై ఎలాంటి ఛార్జీలు పడవు.

UPI Payments: యూపీఐ వాడేవారికి కేంద్రం శుభవార్త.. ఈ ఏడు లావాదేవీలు పూర్తిగా ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు ఉండవ్..
Upi Payments
Venkatrao Lella
|

Updated on: Sep 18, 2026 | 7:01 AM

Share

కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలను అమలు చేయనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ కొత్త విధానం ప్రవేశపెట్టనున్నారు. దీంతో రూ.2 వేలుపైబడి కస్టమర్ నుంచి స్వీకరించే యూపీఐ పేమెంట్స్‌కు వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ ఆపరేటర్లకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల కస్టమర్లపై ఎలాంటి భారం పడకపోయినప్పటికీ.. వీటిని చెల్లించాల్సిందిగా కస్టమర్లను వ్యాపారులు బలవంతపెట్టే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో సామాన్య ప్రజల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఏడు రకాల యూపీఐ లావాదేవీలు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉచితంగా నిర్వహించుకోవచ్చు.  ఆర్బీఐ, ఎన్‌పీసీఐ నిబంధనల ప్రకారం ఇవి పూర్తగా ఉచితం. వీటిపై ఒక్క రూపాయి కూడా మీరు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ ఏడు లావాదేవీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ 7 లావాదేవీలు పూర్తిగా ఫ్రీ..

-ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి యూపీఐ రోజువారీ నగదు లిమిట్ వరకు ఎంత అయినా పంపించుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్లకు ఎటువంటి ఛార్జీలు పడవు. ఇవి పూర్తిగా ఉచితం. ఇక ఇతరుల నుంచి మీరు అందుకునే సొమ్ముపై కూడా ఎలాంటి ఛార్జీలు పడవు

-టీ షాప్, కిరాణా షాప్ వంటి చిన్న వ్యాపారుల వద్ద నెలకు రూ.లక్ష వరకు చేసే నగదు బదిలీపై ఎలాంటి ఛార్జీలు పడవు. దీంతో ఎలాంటి చింత లేకుండా చేసుకోవచ్చు.

-ఇక వ్యాపారుల వద్ద రూ.2 వేలలోపు చేసే యూపీఐ పేమెంట్స్‌కు ఎలాంటి ఛార్జీలు పడవు. రూ.2వేలుపైబడి పంపితేనే వ్యాపారికి ఎండీఆర్ ఛార్జీలు పడతాయి.

-ప్రభుత్వ చలాన్లు, పన్నులు, సేవలు, నిధులకు సంబంధించి చేసే యూపీఐ లావాదేవీలకు పూర్తిగా ఉచితం. కేవలం యుటిలిటీ బిల్లులకు మాత్రమే ఛార్జీలు పడతాయి

-యూపీఐ ఆటో మ్యాండేట్ లావాదేవీలు పూర్తిగా ఉచితం. యుటిలిటీ బిల్లులు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, సిప్‌లకు ఆటో పేమెంట్ మోడ్‌లో చెల్లింపులు చేస్తుంటే ఎలాంటి ఛార్జీలు పడవు.

-రూ.2 వేలలోపు పెద్ద వ్యాపారుల వద్ద చేసే యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితం. ఒకవేళ రూ.2 వేల పరిమితి దాటితే వ్యాపారుల నుంచి బ్యాంకులు, పేమెంట్ సంస్థలు వసూలు చేస్తాయి. సామాన్యులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు.

కస్టమర్లపై వ్యాపారులు భారం వేయవచ్చా..?

ఎండీఆర్ ఛార్జీల భారం కస్టమర్లపై వ్యాపారులు వేయకూడదు. ఇది చట్టరీత్యా నేరంగా పరిగణించి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో కస్టమర్లపై భారం వేయవద్దని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పూర్తిగా వ్యాపారుల నుంచే వీటిని వసూలు చేయాలని బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లకు సూచించింది.

Follow Us