చాణక్య నీతి : అప్పులు తీరాలంటే ఈ పని చేయండి

Samatha

18 september 2026

Pic credit - Pinterest

 ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.

ఆచార్య చాణక్యుడు

అదే విధంగా ఆయన బంధాలు బంధుత్వాల గురించి మాత్రమే కాకుండా, ఆర్థిక క్రమ శిక్షణ గురించి తెలిపాడు. కాగా, దాని గురించి తెలుసుకుందాం.

బంధాలు, బంధుత్వాలు

చాలా మంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదు అని ఎక్కువగా బాధపడుతుంటారు. అలాంటి వారికి చాణక్యుడు ఆర్థిక విషయాల్లో సరైన మార్గదర్శకాలను అందించడం జరిగింది.

మనీ

చాలా మంది ఉదయం లేచిందంటే చాలు గొడవలు పడటం, చిరాకు పడటం చేస్తుంటారు. అంతే కాకుండా కొందరు ఆలస్యంగా నిద్రలేస్తారు. దీంతో రోజంతా ఒత్తిడి, అసహనంతో గడుపుతుంటారు.

ఉదయం చిరాకు

అయితే చాణక్యుడి ప్రకారం ఎవరు అయితే ఎక్కువ బద్ధకంతో ఉంటారో, వారి ఇంటిలో ఎక్కువగా డబ్బు నిలవదు, ఖర్చులు అధికం అవుతాయని చెబుతున్నాడు.

బద్ధకం

అంతే కాకుండా కొంత మంది డబ్బును అవమానించడం చేస్తుంటారు. అయితే ఎవరు అయితే డబ్బు విషయంలో చిన్న చూపు చూస్తుంటారో వారి వద్ద మనీ నిలవదంట.

మనీ ఉండదు

అంతే కాకుండా అన్నాన్ని అవమానించడం కూడా మంచిది కాదంట. దీని వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతుంది. ఇంటిలో ఆర్థిక సమస్యలు పెరుగుతాయంట. అందువలన అన్నాన్ని  అవమానించకూడదు.

ఆర్థిక సమస్యలు

డబ్బు పెరగాలి అంటే, ఆర్థికపరమైన ఖర్చులపై నియంత్రణ ఉండాలి. రోజుకు ఎంత ఖర్చు పెట్టాలి అనేది నిర్ణయించుకొని ఖర్చు పెట్టడం వలన అప్పులు తగ్గిపోతాయి.

నియంత్రణ