Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: ఇకపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ.. అధికారిక గెజిట్ రిలీజ్..

తీవ్ర ఉద్రిక్తతలు, వాగ్వివాదాల మధ్య అట్టుడికిన కోనసీమ జిల్లాపై ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr. BR Ambedkar) కోనసీమ జిల్లాగా మారుస్తూ అధికారిక గెజిట్ విడుదల చేసింది. జిల్లా పేరును...

Konaseema: ఇకపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ.. అధికారిక గెజిట్ రిలీజ్..
Konaseema Distrcit
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 03, 2022 | 11:57 AM

తీవ్ర ఉద్రిక్తతలు, వాగ్వివాదాల మధ్య అట్టుడికిన కోనసీమ జిల్లాపై ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr. BR Ambedkar) కోనసీమ జిల్లాగా మారుస్తూ అధికారిక గెజిట్ విడుదల చేసింది. జిల్లా పేరును మారుస్తూ మే 18 న రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన సమయంలో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌, కాటన్‌దొర, డొక్కా సీతమ్మ వంటి గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టాలనే డిమాండ్లు వ్యక్తమయ్యాయి. అయితే అమలాపురం (Amalapuram) పార్లమెంటు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో అంబేడ్కర్‌ పేరు పెట్టాలనే వాదన తెరపైకి వచ్చింది. కానీ ఈ డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా ఈ ఏడాది ఏప్రిల్‌ 4న కోనసీమ (Konaseema) జిల్లా పేరుతోనే కొత్త జిల్లాను విభజించింది. ప్రభుత్వ తీరుతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాల్సిందేనని ఆందోళనలు చేపట్టారు. మే 24న ‘చలో అమలాపురం’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అమలాపురం రణరంగంగా మారింది. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టారు. కాల్పులు జరిగాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం కలిగించింది.

దాదాపు పది రోజుల పాటు అమలాపురంలో ఉద్రిక్త ఘటనలు ఏర్పడ్డాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఇంటర్నెట్ నిలిపివేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 235 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాగా.. అంబేడ్కర్‌ పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ 1984లోనే తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి ఈ డిమాండ్ వినిపిస్తున్నా.. జిల్లాలను విభజిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ డిమాండ్‌కు మరోసారి బలం వచ్చింది. అంబేడ్కర్‌ జిల్లాను ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి సభ్యులు ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వినతిపత్రం అందించారు. ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చింది.

కాగా తీవ్ర ఉద్రిక్తతలు, డిమాండ్లు, ఎదురుచూపులకు తెర దించుతూ ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమలాపురం కేంద్రంగా ఏర్పడిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం , రాజోలు, పి.గన్నవరం, రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం నియోజకవర్గాలు ఉన్నాయి. 22 మండలాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

For Official Gazette 

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..