పెన్షన్ లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పధకానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌లో పలు కీలక మార్పులు చేసింది. పెన్షన్లు అందుకోవడంలో పలువురు లబ్దిదారులు పోర్టబులిటీ లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనితో ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా పెన్షన్ తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడైనా, 6 నెలలు కంటే ఎక్కువ సమయం వేరే ప్రాంతాలకు వెళ్లి ఉన్నవారికి.. వారున్న చోటే పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. లబ్దిదారులు ఉంటున్న ప్రాంతంలోని సమీప సచివాలయానికి, వాలంటీర్‌కు మ్యాప్ చేయాలంటూ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Also Read: