AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Udaya Bhanu Samineni: ప్రభుత్వ విప్ ఉదయభానుపై ఉన్న 10 కేసులు ఎత్తివేత.. ఉత్తర్వులిచ్చిన ప్రత్యేక న్యాయస్థానం..

Samineni Udaya Bhanu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విప్‌, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న పది

Udaya Bhanu Samineni: ప్రభుత్వ విప్ ఉదయభానుపై ఉన్న 10 కేసులు ఎత్తివేత.. ఉత్తర్వులిచ్చిన ప్రత్యేక న్యాయస్థానం..
Samineni Udaya Bhanu
Shaik Madar Saheb
|

Updated on: May 29, 2021 | 12:50 PM

Share

Samineni Udayabhanu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విప్‌, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న పది కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా.. విజయవాడలో ఏర్పాటైన రాష్ట్రస్థాయి ప్రత్యేక న్యాయస్థానంలో సామినేని ఉదయభానుపై నమోదైన ఈ పది కేసుల విచారణ ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ క్రమంలో వాటన్నింటినీ ఒకేసారి ఉపసంహరించుకుంటూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ఏడాది మార్చి 23న డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు హోం మంత్రిత్వశాఖ కేసుల ఎత్తివేత ఉత్తర్వులను జారీ చేసింది. ఇందుకు వీలుగా ఆయా న్యాయస్థానాల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులిచ్చింది.

కాగా.. సీఎస్‌పీఏ ఆర్గనైజేషన్‌ పేరిట సర్వే నిర్వహిస్తున్న కొందరు సిబ్బందిని అక్రమంగా నిర్బంధించారని, వారిని అపహరించి నేరపూరితంగా బెదిరించారన్న ఫిర్యాదుపై జగ్గయ్యపేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అదేవిధంగా జగ్గయ్యపేట ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు ఆర్‌అండ్‌బీ ఏఈఈ విధులకు ఆటంకం కలిగించటం, నేరపూరిత బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులను ప్రత్యేక న్యాయస్థానం ఎత్తివేసింది. వాటితోపాటు జగ్గయ్యపేట స్టేషన్‌లో నమోదైన మరికొన్ని కేసులు, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు స్టేషన్లల్లో నమోదైన పలు కేసులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Also Read:

Homeopathy: కరోనా కట్టడికి హోమియో చికిత్స.. హైదరాబాద్ కేంద్రంగా ట్రయల్స్.. వివరాలు..

Fake Currency: మీ దగ్గరున్న రూ. 100 నోట్లు అసలైనవేనా.? నకిలీ నోట్లను ఇలా క్షణాల్లో గుర్తించండి.!