Andhra Pradesh: అదంతా ఫేక్ ప్రచారం.. క్రోసూరు ఘటనపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇదే

| Edited By: Subhash Goud

Jun 13, 2023 | 9:21 PM

ఈనెల 12న పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో నాలుగో విడత జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ తన కాన్వాయ్‌లో వెళ్తుండగా ఓ మహిళ తన బిడ్డ సమస్య చెప్పుకునేందుకు ఆయన వాహనానికి ఎదురుగా వచ్చింది.

Andhra Pradesh: అదంతా ఫేక్ ప్రచారం.. క్రోసూరు ఘటనపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇదే
Cm Jagan
Follow us on

ఈనెల 12న పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో నాలుగో విడత జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ తన బస్సులో  వెళ్తుండగా ఓ మహిళ తన బిడ్డ సమస్య చెప్పుకునేందుకు ఆయన వాహనానికి ఎదురుగా వచ్చింది. దీంతో సీఎం ఆమెను పట్టించుకోకుండా కారులో ముందుకు వెళ్లిపోయారంటూ ఓ వార్త పత్రికలో కథనం వచ్చింది. అలాగే కాన్వాయ్ నుంచి తప్పించేందుకు ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారని సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. అయితే దీనికి సంబంధించి ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఈ వార్తలన్నీ అవాస్తవం అని కొట్టిపారేసింది. ఈ విషయంపై వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు కూడా అవాస్తవాలేనని స్పష్టం చేసింది.

కాన్వయ్‌కు ఎదురుగా వచ్చిన వారిని సీఎం జగన్ గమనించారని.. వెంటనే భద్రతా సిబ్బందికి చెప్పి ఆ మహిళను తీసుకురావాలంటూ ఆదేశించారని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ఆ తర్వాత భద్రతా సిబ్బంది, జాయింట్ కలెక్టర్ ఆమెను సీఎం వద్దకు పంపించారని చెప్పింది. వారి సమస్యను తెలుసుకున్న ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఆ మహిళ కుమారుడి విరిగిన చేయి కోసం రూ.లక్ష ఆర్థిక సహాయం చేశారని పేర్కంది. అంతేకాకుండా ఆ బాలుడికి ఎప్పటికప్పుడు ఫిజియోథెరపీ చేయించవలసిందిగా ఆదేశించారని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..