CM Jagan: ఏపీ సర్కారును వరించిన ప్రతిష్ఠాత్మక అవార్డు.. అధికారులకు సీఎం జగన్‌ అభినందనలు

పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు అందించడం, ఆ రుణాలను సద్వినియోగం చేసుకోవటం.. సకాలంలో తిరిగి చెల్లించడంలో అత్యుత్తమ ఫలితాలను సాధించడంలో ఏపీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషికి గుర్తింపుగానే ప్రతిష్టాత్మక స్కోచ్‌

CM Jagan: ఏపీ సర్కారును వరించిన ప్రతిష్ఠాత్మక అవార్డు.. అధికారులకు సీఎం జగన్‌ అభినందనలు
Cm Jagan

Updated on: Apr 28, 2023 | 7:25 AM

ఏపీ ప్రభుత్వానికి అరుదైన అవార్డు వరించింది. ప్రతిష్టాత్మక గోల్డ్‌ అవార్డును స్కోచ్‌ సంస్థ ప్రదానం చేసింది. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు అందించడం, ఆ రుణాలను సద్వినియోగం చేసుకోవటం.. సకాలంలో తిరిగి చెల్లించడంలో అత్యుత్తమ ఫలితాలను సాధించడంలో ఏపీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషికి గుర్తింపుగానే ప్రతిష్టాత్మక స్కోచ్‌ సంస్ధ గోల్డ్‌ అవార్డు ప్రదానం చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పొదుపు సంఘాల మహిళలకు సులభ విధానంలో రుణాలు అందేలా స్త్రీ నిధి సంస్థ కృషి చేస్తోంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధకు అనుబంధంగా పనిచేస్తున్న స్త్రీ నిధి సంస్ధ. ఈ సందర్భంగా సీఎం జగన్‌ స్కోచ్‌ అవార్డులను అధికారులకు చూపించారు. వారి పనితీరును మెచ్చుకుని అభినందించారు. కాగా గురువారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. మహిళల స్వయం సాధికారిత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు.

 

ఇవి కూడా చదవండి

అలాగే చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. చేయూత కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా నిర్ణయించిన వ్యవధి మేరకు క్రమం తప్పకుండా వారికి ఆర్థిక సహాయం అందుతుందని సీఎం జగన్ అన్నారు. ఈ డబ్బు వారి జీవనోపాధికి ఉపయోగపడేలా ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకుల సహాయంతో స్వయం ఉపాధి మార్గాలను అమలు చేస్తోందని, దీన్ని మరింత విస్తృతం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..