New Year 2023: మందుబాబులకు కిక్కే కిక్కు.. రెండు రోజులు పండగే పండగ.. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు..

|

Dec 31, 2022 | 3:27 PM

న్యూ ఇయర్ సందర్భంగా అంతటా జోష్ నెలకొంది. నూతన సవంత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు యూత్‌ భారీగా ప్లాన్‌ చేసుకుంటోంది.

New Year 2023: మందుబాబులకు కిక్కే కిక్కు.. రెండు రోజులు పండగే పండగ.. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు..
Liquor
Follow us on

న్యూ ఇయర్ సందర్భంగా అంతటా జోష్ నెలకొంది. నూతన సవంత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు యూత్‌ భారీగా ప్లాన్‌ చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్బంగా మద్యం దుకాణాల పని వేళల సమయాన్ని పొడిగించినట్లు శనివారం వెల్లడించింది. డిసెంబర్‌ 31, జనవరి 1న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 వరకు నడవనుండగా.. బార్‌ అండ్‌ రెస్టారెంట్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకూ తెరిచి ఉంచనున్నారు. కాగా, ఏపీలో ప్రతిరోజు రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఉంది. కానీ, న్యూ ఇయర్ సందర్భంగా వైన్స్ షాపు సమయాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్‌ సర్కార్ నిర్ణయం పట్ల మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. గతేడాది మాత్రం రాత్రి 10 గంటలకే మందుషాపులు మూసేయగా.. ఈ ఏడాది మాత్రం సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

న్యూఇయర్ వేడుకలపై రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. వేడుకల పేరుతో మద్యం తాగి రోడ్లపై ర్యాష్‌ డ్రైవింగ్‌, హంగామా లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు కూడా చేపట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల వేళలను ఇప్పటికే పొడగించిన విషయం తెలిసిందే. ఒంటి గంట వరకు మద్యం విక్రయించేలా అనుమతులిచ్చింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..