AP Tenth Exams: జూలై 26 నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు.. 11 పేపర్లు బదులుగా ఏడు పేపర్లే.!

|

Jun 17, 2021 | 12:36 PM

కరోనా కారణంగా వాయిదాపడిన టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోకి..

AP Tenth Exams: జూలై 26 నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు.. 11 పేపర్లు బదులుగా ఏడు పేపర్లే.!
Follow us on

కరోనా కారణంగా వాయిదాపడిన టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుండటంతో పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. జూలై 26 నుంచి ఆగష్టు 2 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 వేలకు పైగా కేంద్రాల్లో 6.28 లక్షల మంది విద్యార్ధులు ఎగ్జామ్స్‌కు హాజరు కానున్నారు.

కరోనా, లాక్‌డౌన్ కారణంగా వారిపై ఒత్తిడి లేకుండా ఉండేందుకు ఈ ఏడాది 11 పేపర్లకు బదులు 7 పేపర్లకే పరీక్షలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు వెల్లడించారు. సామాన్య శాస్త్రం మినహా మిగతా సబ్జెక్టులు 100 మార్కులకు.. భౌతిక, రసాయన శాస్త్రం పేపర్‌ 1గా, జీవశాస్త్రం పేపర్ 2గా 50 మార్కుల చొప్పున నిర్వహిస్తామని అన్నారు. కాగా, జూలై 7 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు కూడా పలు ప్రతిపాదనలు సూచించింది. ఇవాళ విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తుండటంతో.. ఆయన పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

Also Read:

గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!

మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..

 పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!

కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్ సంకేతాలు.. జూన్ 20 నుంచి మరిన్ని సడలింపులు..!