Business dull : బిజినెస్ లేక, పెట్టుబడికి వడ్డీలు.. షాపు అద్దెలు.. వర్కర్లకు జీతాలు ఇవ్వలేక, దిక్కుతోచని స్థితిలో వస్త్ర వ్యాపారస్తులు..!

మా కష్టాల గురించి పట్టించుకొనే సంగతి దేవుడెరుగు..! కనీసం ఆ ఆలోచన చేసే పాలకులైనా ఉన్నారా..? అంటూ విలపిస్తున్నారు చిన్నా చితకా వ్యాపారులు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేసిన వేళ షట్టర్‌ లాక్ ఓపెన్ చేసి.. సర్దుకునేలోపే..

Business dull : బిజినెస్ లేక, పెట్టుబడికి వడ్డీలు.. షాపు అద్దెలు.. వర్కర్లకు జీతాలు ఇవ్వలేక, దిక్కుతోచని స్థితిలో వస్త్ర వ్యాపారస్తులు..!
Business Dull Due To Corona
Venkata Narayana

|

Jun 17, 2021 | 3:05 PM

Textile merchants : మా కష్టాల గురించి పట్టించుకొనే సంగతి దేవుడెరుగు..! కనీసం ఆ ఆలోచన చేసే పాలకులైనా ఉన్నారా..? అంటూ విలపిస్తున్నారు చిన్నా చితకా వ్యాపారులు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేసిన వేళ షట్టర్‌ లాక్ ఓపెన్ చేసి.. సర్దుకునేలోపే లాక్‌డౌన్ మినహాయింపు సమయం అయిపోతుంది. వ్యాపారం నడిచేదెట్టా.. బతుకు బండి సాగేదెట్టా అని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడ చిరు, పెద్ద వ్యాపారులు నిట్టూరుస్తున్నారు. కరోనా కారణంగా బిజినెస్ డల్ అయిపోయింది.. లాక్ డౌన్ కారణంగా చిన్నా, పెద్దా వ్యాపార రంగాలు అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి ఎదుర్కొంటున్నామని టీవీ9తో వ్యాపారస్తులు మొరపెట్టుకుంటున్నారు.

పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారం గిట్టుబాటయ్యేది. వివాహాది శుభకార్యాలకు జువెల్లర్స్‌, వస్త్ర, వ్యాపార రంగాలు కళకళలాడేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు. వ్యాపారం ముందుకు సాగడం లేదు.. బతుకు భారంగా మారి ఆర్థిక ఇబ్బందులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని తల్లడిల్లిపోతున్నారు.  కరోనా మహమ్మారి వేళ విజయవాడలో ఎప్పుడూ సందడిగా ఉండే వ్యాపార కూడళ్ళు ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయాయి. బట్టల దుకాణాలు కస్టమర్లు లేక కళ తప్పాయి. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కొంతలో కొంత జనం వస్తున్నా.. ఆ తర్వాత వచ్చే నాథుడే కరువయ్యాడు.

దీంతో వ్యాపారం గిట్టుబాటు కాక సిబ్బందికి జీతాలు చెల్లించలేక, అద్దెలు కట్టలేక వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. బిజినెస్ లేకపోవడంతో షాపులు క్లోజ్ చేస్తున్నారు. లోపల ఈగలు కొట్టుకునే కంటే ఇంట్లో ఉన్నదే బెటర్ అంటూ షట్టర్లకు లాక్ చేస్తున్నారు. లోన్ ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు రెట్టింపయ్యాయి. గతేడాది లాగే ఈసారి కూడా కేంద్రం మారటోరియం ప్రకటించాలని, చిన్నా పెద్దా వ్యాపారస్తులను ఆదుకోవాలని కోరుతున్నారు.

లాక్‌డౌన్ ఎఫెక్ట్ తో అటు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు కిక్కిరిసియేలా ఉండే ప్రాంతాలు ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయాయి. కస్టమర్లు లేక హోటళ్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు డీలాపడ్డాయి. చాలీచాలని వ్యాపారంతో సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. కష్టకాలం నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వమే ఆదుకోవాలని విఙ్ఞప్తి చేస్తున్నారు వ్యాపారులు. లాక్ డౌన్ టైమింగ్స్ తో జనాలు పెద్దగా రోడ్లపైకి రావడం లేదు. దీంతో ఉన్న సమయంలో బిజినెస్ నడుస్తుందనుకుంటే అది కూడా లేదు. రెంట్ కూడా చెల్లించలేని పరిస్థితి. ఇక ఈఎంఐలు ఎలా చెల్లించేదని వ్యాపారులు నిట్టూరుస్తున్నారు.

చిరుహోటళ్ల పరిస్థితి కూడా అధ్వాన్నంగానే మారింది. నాలుగు గంటల సమయంలో టిఫిన్స్ తయారు చేస్తున్నా.. వర్కవుట్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు కేవలం టేక్ అవే కి మాత్రమే పరిమితం అయ్యాయి. సమయం పొడిగిస్తే కాస్త గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. ఇలా లాక్ డౌన్ ఎఫెక్ట్‌ వ్యాపార రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.

చిన్న వ్యాపారుల సంగతి ఇలాఉంటే, కరోనా సెకండ్ వేవ్, ‌లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కరోనా ఎఫెక్ట్ తోపాటు పెట్రో ధరలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ఇటీవల మారుతి సుజుకి సేల్స్ భారీ స్థాయిలో పడిపోయిన సంగతి తెలిసిందే. మే మాసానికి సంబంధించిన మారుతి సుజుకి కార్ల సేల్స్ డేటాను ఆ సంస్థ ఇటీవల విడుదల చేసింది.

ఏప్రిల్ మాసంతో పోలిస్తే మే మాసంలో మారుతి సుజుకి కార్ల సేల్స్ ఏకంగా 71 శాతం తగ్గాయి. ఏప్రిల్ మాసంలో 1,59,691 యూనిట్లు విక్రయించగా… కొవిడ్ ఉధృతి నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తుండటంతో మే మాసంలో కేవలం 46,555 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. మే మాసంలో అమ్ముడుపోయిన కార్లలో దేశీయ మార్కెట్లో అమ్ముడుపోయినవి కేవలం 33,771 యూనిట్లు మాత్రమే.

మెడికల్ అవసరాల కోసం ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు తరలించేందుకు మారుతి సుజుకి సంస్థ మే 1 నుంచి 16 వరకు దేశంలోని తమ ప్లాంట్స్‌లో కార్ల ఉత్పత్తిని ఆపేసింది. గత ఏడాది మే మాసంలోనూ లాక్‌డౌన్ అమలు చేయడంతో కార్ల ఉత్పత్తి, విక్రయాలు తగ్గాయి. మిగిలిన ఆటోమొబైల్ సంస్థలు సైతం మే మాసంలో అతి తక్కువ సేల్స్‌ను నమోదుచేసుకోనున్నాయి.

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు కొత్త కార్లు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపకపోవడం కార్ల సేల్స్ గణనీయంగా తగ్గటానికి కారణంగా తెలుస్తోంది. కోవిడ్ ఉధృతి తగ్గుముఖంపట్టి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తే కార్ల విక్రయాలు పుంజుకునే అవకాశముందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. ఇలా అన్ని రకాల వ్యాపార సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

Read also : YS Sunitha : పులివెందులలో మా ప్రాణాలకు ముప్పు ఉంది.. భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని కోరిన వివేకా కుమార్తె సునీత

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu