AP Eamcet Results 2023 Live: ఏపీ ఎంసెట్ ఫలితాలలో బాలురిదే పైచేయి.. రిజల్ట్స్ కోసం ఇక్కడ చూడండి
EAPCET Results 2023 Live Updates: ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను జూన్ 14 బుధవారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

ఆంధ్రపదేశ్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. మరికాసేపట్లో ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను జూన్ 14 బుధవారం విజయవాడలో ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు.
మే 15 నుంచి 19 వరకు జరిగిన ఇంజినీరింగ్ స్ట్రీమింగ్ పరీక్షకు 2.24 లక్షల మంది హాజరవగా.. అదే నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీం పరీక్షకు 90,573 మంది హాజరయ్యారు. ఇక ఇంజినీరింగ్ ప్రవేశాలకు 2,37,193 మంది విద్యార్ధులు.. అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశాలకు 99, 557 మంది దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. మీరు కూడా వేగంగా ఫలితాలను తెలుసుకోవాలంటే.. లేట్ ఎందుకు.! టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి.. వెంటనే మీ రిజల్ట్స్ చూసేయండి..
LIVE NEWS & UPDATES
-
టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో ఎంసెట్ ఫలితాల కోసం ఇలా..
-
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో వీరికే మొదటి ర్యాంక్..
ఇంజనీరింగ్ విభాగంలో చల్ల ఉమేష్ వరుణ్‌కు 158 మార్క్స్‌తో మొదటి ర్యాంక్.. బూరుగుపల్లి సత్య రాజా జస్వంత్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 153 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించాడు.
-
-
అగ్రికల్చర్ విభాగంలో ఉత్తీర్ణత సాధించినవారు..
అగ్రికల్చర్ విభాగంలో 90,573 మంది విద్యార్ధులు పరీక్ష రాయగా.. అందులో 81,203 మంది క్వాలిఫై అయ్యారు. మొత్తంగా అగ్రికల్చర్ స్ట్రీమ్ లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి వెల్లడించారు.
-
ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత శాతం ఇలా ఉంది..
ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు 2,24,724 మంది విద్యార్ధులు హాజరు కాగా.. అందులో 1,71,514 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 76.32 శాతం మంది క్వాలిఫై అయ్యారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
-
ఏపీ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి..
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు.
-
-
కొంచెం ఆలస్యం కానున్న ఫలితాల విడుదల
ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదలలో కొంత జాప్యం ఏర్పడింది. రాష్ట్ర విద్యాశాఖ వర్గాల తెలిపిన వివరాల ప్రకారం.. ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల అయ్యే అవకాశం ఉంది.
-
ఏపీ ఎంసెట్ పరీక్షలు రాసిన విద్యార్ధులు ఎంతమంది..?
మే 22, 23 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష.. మే 15 నుంచి 19వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2,37,193 మందికి 2.24 లక్షల మంది పరీక్ష రాశారు. అగ్రికల్చర్ విభాగంలో 99,557 మందికి గానూ 90,573 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు.
-
ఏపీ ఎంసెట్ ఫలితాలు
AP EAPCET 2023 ఫలితాలు జూన్ 14న ఉదయం 10 30 గంటలకు విడుదల కావచ్చని భావిస్తున్నారు. APSCHE ద్వారా ఒకసారి విడుదల చేసిన ఫలితాలను మీ టీవీ9 సైట్‌లో చూడండిలా
-
ఏపీ ఎంసెట్ ర్యాంకులు వచ్చేది ఇలా..
AP EAPCET 2023కి ఈ ఏడాది 3,37,500 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే అభ్యర్థుల సంఖ్య 12 శాతం పెరిగింది. ఈ సంవత్సరం, ఇంటర్మీడియట్‌లో 25% మార్కులు, AP EAPCET 2023 స్కోర్‌లో 75% మార్కుల ఆధారంగా విద్యార్ధులకు ర్యాంకులు వస్తాయి.
-
ఎంసెట్ పరీక్షలు జరిగింది ఇప్పుడు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష AP EAPCET. ఈ ఏడాది మే 15 నుంచి 19 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించారు.
-
మరికాసేపట్లో ఎంసెట్ ఫలితాలు..
ఏపీ ఎంసెట్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 10.30 గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
Published On - Jun 14,2023 9:30 AM