AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Eamcet Results 2023: ఏపీ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఏపీ ఎంసెట్ పరీక్ష 2023 ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ విజయవాడలో..

AP Eamcet Results 2023: ఏపీ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండి..
Ap Eapcet
Ravi Kiran
|

Updated on: Jun 14, 2023 | 11:51 AM

Share

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఏపీ ఎంసెట్ పరీక్ష 2023 ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ విజయవాడలో ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో చల్ల ఉమేష్ వరుణ్‌కు 158 మార్క్స్‌తో మొదటి ర్యాంక్.. బూరుగుపల్లి సత్య రాజా జస్వంత్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 153 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించాడు. ఏపీ EAPCETకి మొత్తం 3,38,739 మంది విద్యార్ధులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు నమోదు చేసుకున్న సంఖ్య 2,38,180 కాగా.. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో రిజిస్టర్ చేసుకున్నవారు 1,00,559 మంది విద్యార్ధులు.

మొత్తం 2,24,724 మంది ఇంజనీరింగ్‌లో పరీక్షకు హాజరు కాగా.. 1,71,514 మంది విద్యార్ధులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 90,573 మంది పరీక్షకు హాజరు కాగా 81,203 మంది విద్యార్దులు క్వాలిఫై అయ్యారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి వెల్లడించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌‌‌తో పాటు టీవీ9 వెబ్‌సైట్ నుంచి కూడా ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాగా, మే 15-19 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష, మే 22, 23లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 2.24 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. అగ్రికల్చర్‌ విభాగంలో 90,573 మంది పరీక్షకు హాజరైన సంగతి విదితమే.

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?