AP Weather Alert: మే నెల కూడా రాకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఆంధ్రా ప్రజల పరిస్థితి నిప్పుల కొలిమిలో నివాసంలా మారుతోంది. మరోవైపు సూర్యుని వచ్చే వేడి ధాటికి పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది. ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్(ఐఎండీ) అంచనాల ప్రకారం శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇంకా క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక మెసెజ్లు పంపిస్తున్నామని, ఆయా ప్రాంతాలవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శుక్రవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల్లో అల్లూరి జిల్లాలో ఒక మండలం ఉంది. అలాగే అనకాపల్లిలో 14, గుంటూరులో 7, కాకినాడలో 7, కృష్ణాలో 4, ఎన్టీఆర్‌లో 4, పల్నాడులో 1, విశాఖపట్నంలో 1, విజయనగరం జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
గురువారం అనకాపల్లి 8, విజయనగరం ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయి. మరో 51 మండలాల్లో వడగాల్పులు నమోదైనవి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..