AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: సమస్యంటూ సోషల్‌ మీడియాలో విద్యార్థుల పోస్ట్.. క్షణాల్లో పరిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌!

మా ఊర్లో సమస్య ఉంది పరిష్కరించండి మహా ప్రబో అంటూ అధికారుల చుట్టూ తిరిగినా కొన్ని సార్లు మన సమస్యలకు పరిష్కారం దొరకదు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం సోషల్‌ మీడియాలో విద్యార్థులు పెట్టిన ఒక పోస్ట్‌ను చూసి వాళ్ల సమస్యకు పరిష్కారం చూపారు. పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశాన్ని చూసిన పవన్ కల్యాణ్‌.. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు.

Pawan Kalyan: సమస్యంటూ సోషల్‌ మీడియాలో విద్యార్థుల పోస్ట్.. క్షణాల్లో పరిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌!
Pawan Kalyan Road Sanction
Anand T
|

Updated on: Feb 07, 2026 | 4:33 PM

Share

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తెగ ఇబ్బందులు పడుతున్నారు. తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో వేదికగా ఏపీ డిప్యూటీ పవన్‌ కళ్యాన్‌కు ఓ వీడియో సందేశం పంపారు. అది చూసిన పవన్ కల్యాణ్‌ దానిపై వెంటనే స్పందించి స్థాకిన జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల కష్టాలు తీరనున్నాయి.

ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో రూ. 55 కోట్లతో రోడ్లు

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ. 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు వెచ్చించారు.

ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈ రోజు గజ్జలవారిపల్లి విద్యార్థుల అభ్యర్ధనతో డిప్యూటీ సీఎం ఆదేశంతో ఈ రోడ్డును అదనంగా మంజూరు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us