AP Dasara Holidays 2022: ఏపీ పాఠశాలలకు దసరా సెలవులు.. ఎప్పటి నుంచి అంటే..
AP Dasara Holidays 2022: విద్యాసంస్థలకు దసరా సెలవులు వచ్చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను..

AP Dasara Holidays 2022: విద్యాసంస్థలకు దసరా సెలవులు వచ్చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించగా, తాజాగా ఏపీ సర్కార్ కూడా పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. క్రిస్టియన్, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్ 1 నుంచి 6వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది. 7వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం తెలిపింది.
విద్యా సంవత్సరంలో పాఠశాలలకు 220 పనిదినాలు కాగా, మొత్తం 80 సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు ఉండగా, 10వ తేదీని తిరిగి తెరుచుకోనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







