CM Jagan Meets Dattatreya: దుర్గమ్మ సేవలో దత్తాత్రేయ.. మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం జగన్..
CM Jagan Meets Dattatreya: విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..
CM Jagan Meets Dattatreya: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ విజయవాడ పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ దత్తాత్రేయను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం జగన్‌తో పాటు వచ్చిన డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను గవర్నర్ దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంతో సత్కరించారు.
ఇక మంగళవారం ఉదయం గవర్నర్ దత్తాత్రేయ కనకదుర్గ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్ధ ప్రసాదాలు అందించారు. కాగా, ఆలయ దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్ దత్తాత్రేయ.. కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించడం ద్వారా త్వరలోనే మహమ్మారిపై విజయం సాదించబోతున్నామని అన్నారు.