Sankranti Traffic Rush : పల్లెకు కదిలిన పట్టణం.. టోల్ ప్లాజా వద్ద సంక్రాంతి వాహనాల సందడి..
పండుగకు ఇంకా పెద్దగా టైమ్ లేకపోవడంతో ...మూడ్రోజుల ముందు నుంచే అన్ని వెహికిల్స్ హైవేపైకి ఎక్కాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే వాహనాలతో నేషనల్ హైవే 65పై హెవీ ట్రాఫిక్ జామ్ అవుతోంది.
Sankranti Traffic Rush : సంక్రాంతి వచ్చిందంటే చాలు… హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాని ఈసారి ఆ ప్రభావం మరింత పెరిగింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు గతంలో మాదిరిగా రైళ్లు, బస్సులు సరిపడ లేకపోవడం, కరోనా కారణంగా నగరవాసులు సొంత వాహనాలు ఏర్పాటు చేసుకోవడంతో నేషనల్ హైవేపై వేలాదిగా వెహికిల్స్ బారులు తీరాయి.
LIVE NEWS & UPDATES
-
ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీల బాదుడు..
పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు రెట్టింపు చేశాయి. ప్రైవేటు ట్రావెల్స్ నిత్యం తిరిగే సర్వీసుల్లోనే ఛార్జీలను ఒక్కసారిగా పెంచేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వచ్చే ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీసులో ఛార్జీ రూ.600 ఉండగా, ప్రత్యేక సర్వీసుల్లో రూ.900 వరకు ఉంది. అదే ప్రైవేటు ట్రావెల్స్‌లో రూ.1,400-1,600 వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏలూరుకు ఆర్టీసీ సూపర్‌లగ్జరీ ఛార్జీ రూ.485 కాగా, ప్రత్యేక బస్సుల్లో రూ.720 తీసుకుంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌లో మాత్రం రూ.1300-1500 రాబడుతున్నారు.
-
జిల్లాల మధ్య తిరిగే బస్సుల్లో కూడా సంక్రాంతికి రద్దీ…
తెలంగాణలో వివిధ జిల్లాల మధ్య తిరిగే బస్సుల్లో కూడా సంక్రాంతికి రద్దీ కనిపిస్తోంది. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు షెడ్యుల్ బస్సులతో పాటు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశారు. ఇక ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి యాదగిరిగుట్ట, వరంగల్ వైపు వెళ్లే వారికోసం.. షెడ్యూల్ బస్సులతోపాటు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు.
-
-
అన్ని మార్గాల్లో రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక సర్వీసులు
అన్ని మార్గాల్లో రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక సర్వీసులు పెంచేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సీబీఎస్ నుంచి కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, మాచర్ల, నెల్లూరు వైపు వెళ్లే షెడ్యూలు బస్సులతోపాటు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశారు.
-
తెలంగాణ నుంచి మొత్తంగా 3,607 సంక్రాంతి ప్రత్యేక సర్వీసులు
తెలంగాణ నుంచి మొత్తంగా 3,607 సంక్రాంతి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది. అందులో హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు 1,254 ప్రత్యేక సర్వీసులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే శుక్ర, శనివారాల్లో 102 సర్వీసులు నడిపారు. ఆదివారం 94 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. ఇక సోమ, మంగళవారం అత్యధికంగా 309 ప్రత్యేక సర్వీసులకు ఆన్‌లైన్ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు.
-
ప్రత్యేక బస్సులకు ముందస్తు ఆన్‌లైన్ రిజర్వేషన్ సదుపాయం
ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వచ్చే సర్వీసులకు అధిక డిమాండ్ ఉంది. సోమ, మంగళవారాల్లో రెగ్యులర్ సర్వీసులు దాదాపు నిండిపోయాయి. దీంతో అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులకు ముందస్తు ఆన్‌లైన్ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు.
-
-
అదనంగా ప్రత్యేక బస్సులకు ముందస్తు ఆన్‌లైన్ రిజర్వేషన్
ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వచ్చే సర్వీసులకు అధిక డిమాండ్ ఉంది. సోమ, మంగళవారాల్లో రెగ్యులర్ సర్వీసులు దాదాపు నిండిపోయాయి. దీంతో అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులకు ముందస్తు ఆన్‌లైన్ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు.
-
కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద 12 టోల్ లైన్లు..
సంక్రాంతి పండుగ సందర్భంగా 65వ జాతీయ రహదారిపై వాహనాల సందడి నెలకొంది. హైదరాబాద్ నుండి స్వగ్రామాలకు పయనమైన పట్టణవాసుల వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి. కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద 12 టోల్ లైన్లలో 6 విజయవాడ వైపు, 6 హైదరాబాద్ వైపుకు టోల్ ప్లాజా సిబ్బంది తెరిచి ఉంచారు.
-
2 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్..
టోల్ ప్లాజాలను దాటేందుకు ఒక్కో వాహనానికీ 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతోంది. దాదాపు 2 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో విజయవాడ వైపు మరిన్ని గేట్లను టోల్ ప్లాజా సిబ్బంది తెరిచారు.
-
టోల్‌గేట్ దగ్గర కొత్తగా ఫాస్టాగ్ కూడా అమలు.. వాహనాలు వేగంగా ముందుకు
టోల్‌గేట్ దగ్గర కొత్తగా ఫాస్టాగ్ కూడా అమలు చేస్తుండటంతో … వాహనాలు వేగంగా ముందుగు కదులుతున్నాయి. ఆంధ్రా- తెలంగాణ బోర్డర్ వరకు పరిస్థితి ఇలా ఉంటే….ఇక కృష్ణా జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర ఇదే ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది.
-
రూల్స్ బేఖాతర్ చేసిన ప్రైవేట్ ట్రావెల్స్..
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికుల నుండి ఫిర్యాదులతో శివార్లలో ఆర్టీఏ అధికారులు తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఉదయం ఊళ్లకు బయల్దేరిన నగరవాసుల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే..సాయంత్రం, రేపు ఉదయం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
-
కృష్ణా జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర ఇదే ట్రాఫిక్ జామ్..
టోల్‌గేట్ దగ్గర కొత్తగా ఫాస్టాగ్ కూడా అమలు చేస్తుండటంతో వాహనాలు వేగంగా ముందుగు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. ఆంధ్రా- తెలంగాణ బోర్డర్ వరకు పరిస్థితి ఇలా ఉంటే.. ఇక కృష్ణా జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర ఇదే ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది.
-
ప్రైవేట్ ట్రావెల్స్ అధిక చార్జీలు వసూలు.. ఫిర్యాదులతో శివార్లలో ఆర్టీఏ అధికారుల దాడులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికుల నుండి ఫిర్యాదులతో శివార్లలో ఆర్టీఏ అధికారులు తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఉదయం ఊళ్లకు బయల్దేరిన నగరవాసుల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో అవస్థలు పడుతున్నారు.
-
పంతంగి టోల్ ప్లాజా దగ్గర వరకు కిలోమీటర్ల మేర వాహనాలు..
పండుగకు ఇంకా పెద్దగా టైమ్ లేకపోవడంతో …మూడ్రోజుల ముందు నుంచే అన్ని వెహికిల్స్ హైవేపైకి ఎక్కాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే వాహనాలతో నేషనల్ హైవే 65పై హెవీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముఖ్యంగా నార్కట్‌పల్లి, పంతంగి టోల్ ప్లాజా దగ్గర వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయినట్లుగా తెలుస్తోంది.
Published On - Jan 12,2021 3:51 PM