AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Retaining Wall: కృష్ణలంక వాసుల వరద కష్టానికి అడ్డుకట్ట.. రిటైనింగ్ వాల్‌ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన..

విజయవాడ కృష్ణలంకలో ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్‌. ఎన్నో ఏళ్ల నుంచి ప్రతిసారీ వరదల్లో చిక్కుకుంటున్న ఆ ప్రాంత వాసుల కష్టాలకు చెక్‌ పెట్టే ప్రయత్నాన్ని ప్రారంభించారు.

Retaining Wall: కృష్ణలంక వాసుల వరద కష్టానికి అడ్డుకట్ట.. రిటైనింగ్ వాల్‌ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన..
Retaining Wall Along Krishn
Sanjay Kasula
|

Updated on: Mar 31, 2021 | 1:58 PM

Share

AP CM YS Jagan: విజయవాడ కృష్ణలంకలో ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్‌. ఎన్నో ఏళ్ల నుంచి ప్రతిసారీ వరదల్లో చిక్కుకుంటున్న ఆ ప్రాంత వాసుల కష్టాలకు చెక్‌ పెట్టే ప్రయత్నాన్ని ప్రారంభించారు. కనకదుర్గ వారధి నుంచి కోటినగర్‌ వరకు 1.5 కిలోమీటర్ల పొడవునా నిర్మించే రిటైనింగ్‌ వాల్‌కు శంకుస్థాపన చేశారు.

12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా దీన్ని నిర్మిస్తారు. మూడు అడుగుల వెడల్పుతో 18 మీటర్ల లోతులో ర్యాఫ్ట్‌ పద్ధతిలో పునాదులు వేస్తారు. 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్‌ రిటైనింగ్‌ వాల్‌ను నిర్మిస్తారు. ఇందుకోసం 125 కోట్లను కేటాయించింది ప్రభుత్వం.

ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడు వరదలు వచ్చినా… కృష్ణలంక ఏరియా మునిగిపోతుంది. లక్షల క్యూసెక్కుల వరద వచ్చి పేదల ఇళ్లను ముంచేస్తుంది. ఇప్పుడీ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంతో వరద కష్టాలకు చెక్‌ పెట్టొచ్చు.

ఇవి కూడా చదవండి : ఏప్రిల్ 1 నుంచి ఈ 5 పనులను ప్రారంభించండి… కష్ట సమయాల్లో కూడా డబ్బు కొరత ఉండదు..

ఇవి కూడా చదవండి : Petrol Diesel Rates: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..!