AP CM Jagan: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. నేడు విద్యా దీవెన పథకం కింద నిధులను రిలీజ్ చేయనున్న సీఎం జగన్..

|

Aug 11, 2022 | 6:40 AM

రాష్ట్రంలో అర్హులైన పేద విద్యార్థులు చదువుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ఉద్దేశించిన పథకం జగనన్న విద్యాదీవెన పథకం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీతో పాటు ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ పథకం కింద నగదును అందుకుంటారు.

AP CM Jagan: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. నేడు విద్యా దీవెన పథకం కింద నిధులను రిలీజ్ చేయనున్న సీఎం జగన్..
Ap Cm Jagan
Follow us on

AP CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నేడు బాపట్ల జిల్లాలో పర్యటన చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద మూడో త్రైమాసిక నగదు బదిలీ కార్యక్రమాన్ని బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు.  ఉదయం 9.30గం. లకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. ఉదయం 10.10లకు బాపట్ల చేరుకోనున్నారు. బాపట్లలోని ఇంజినీరింగ్‌ కళాశాల, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల ప్రాంగణంలో జరగనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. ప్రజలను, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.  ఈ సభకు 25 వేల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారని అంచనా. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం.. తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో సభావేదిక ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మంత్రి మేరుగ నాగార్జున, డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, కలెక్టర్‌ విజయకృష్ణన్, ఎస్పీ వకుల్‌జిందాల్‌ పరిశీలించారు. వ్యవసాయ కళాశాలలో హెలిప్యాడ్‌ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.  సీఎం పర్యటనను జయప్రదం చేయాలని మంత్రి మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. సీఎం జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా అమలు చేస్తోన్న విద్యాదీవెన పథకం చాలా గొప్పదని చెప్పారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా..  గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూ.. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయించిన తేదీకే సంక్షేమ పథకాలను అమలు చేయటం సీఎం జగన్‌కే సాధ్యమైందని చెప్పారు మంత్రి మెరుగ నాగార్జున.

రాష్ట్రంలో అర్హులైన పేద విద్యార్థులు చదువుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ఉద్దేశించిన పథకం జగనన్న విద్యాదీవెన పథకం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీతో పాటు ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ పథకం కింద నగదును అందుకుంటారు. ప్రభుత్వం పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద అందజేస్తుంది. ఈ పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ. 694 కోట్లు విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..