Sujana Chowdary: ఆ ఆధారాలుంటే బయటపెట్టాలి.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వస్తాయ్..
నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు స్మారకార్థంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 నాణెం కార్యక్రమం నాటినుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కాయి.. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబంతోపాటు.. నారా, దగ్గుబాటి కుటుంబాలు పాల్గొన్నాయి. అయితే, రాష్ట్రపతి భవన్ వేదికగా
అమరావతి, సెప్టెంబర్ 04: నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు స్మారకార్థంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 నాణెం కార్యక్రమం నాటినుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కాయి.. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబంతోపాటు.. నారా, దగ్గుబాటి కుటుంబాలు పాల్గొన్నాయి. అయితే, రాష్ట్రపతి భవన్ వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. బీజేపీ జతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కావడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఫొటో బయటకు వచ్చిన తర్వాత పొత్తులు గురించే చర్చ జరిగినట్లు చర్చ జరిగింది. అయితే, ఈ వ్యవహారంపై ఏపీ అధికారపార్టీ వైసీపీ.. అటు టీడీపీ, ఇటు బీజేపీని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేసింది. దగ్గుబాటి పురంధేశ్వరి.. చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ వైసీపీ విమర్శించింది. అంతేకాకుండా.. రాష్ట్రపతి భవన్ వేదికగా రాజకీయ చర్చలేంటి ఫైర్ అయింది. అయితే.. ఈ వ్యవహారం కొన్ని రోజులనుంచి నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబుకు అనుకూలంగా పురంధేశ్వరి పనిచేస్తున్నారన్న ఆరోపణలపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి స్పందించారు.
చంద్రబాబుకు అనుకూలంగా పురంధేశ్వరి పనిచేస్తున్నారని ఆరోపణలు చేసేవారు దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలంటూ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం పొన్నవరంలో ‘‘నా మట్టి- నా దేశం’’ కార్యక్రమంలో సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ చేస్తున్న విమర్శలపై ఫైర్ అయ్యారు. ఆ ఆరోపణలు చేయడం కాదని.. ఆధారాలుంటే బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబుకు ఐటీ నోటీసుల విషయం గురించి స్పందించేందుకు సుజనా చౌదరి నిరాకరించారు. తనకు ఆ విషయం తెలియదంటూ స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అనుకూలంగా తాము నడుచుకుంటామని అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వస్తాయన్నది తమ నమ్మకమని సుజనా చౌదరి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..