Viral Video: మా ఊరికి విమానం వచ్చిందోచ్.. అది కూడా లారీపై.. ఆశ్చర్యపోయిన ప్రజలు.. వీడియో..

విమానం ఎంత పెద్దగా ఉంటుందో అందరికీ తెలిసిందే.. అయితే, అలాంటి విమానాన్ని లారీ మీద తరలిస్తుంటే ఎలా ఉంటుంది.. ఈ ఆసక్తికర ఘటన ఏపీలోని కర్నూలులో చోటుచేసుకుంది. కర్నూలు జాతీయ రహదారిపై ఒక విమానాన్ని లారీలో తరలిస్తుండగా.. స్థానిక ప్రజలు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.

Follow us
J Y Nagi Reddy

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 04, 2023 | 7:23 PM

కర్నూలు, సెప్టెంబర్ 04: విమానం ఎంత పెద్దగా ఉంటుందో అందరికీ తెలిసిందే.. అయితే, అలాంటి విమానాన్ని లారీ మీద తరలిస్తుంటే ఎలా ఉంటుంది.. ఈ ఆసక్తికర ఘటన ఏపీలోని కర్నూలులో చోటుచేసుకుంది. కర్నూలు జాతీయ రహదారిపై ఒక విమానాన్ని లారీలో తరలిస్తుండగా.. స్థానిక ప్రజలు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. ఎయిర్ బస్ 320కి చెందిన విమానాన్ని ఢిల్లీ నుంచి కర్నూలుకు లారీలో తీసుకుని వచ్చారు. కర్నూలు చేరుకోడానికి 15 రోజులు పట్టిందని నిర్వాహకులు తెలిపారు. ఆరుగురు వ్యక్తులు భాగస్వాములుగా చేరి కర్నూలు నగరంలో రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. గతంలో హైదరాబాద్, విజయవాడ మహానగరంలో ఇలాంటి హోటళ్లనే ఏర్పాటు చేశారు. అవి ఆహార ప్రియుల మన్ననలలను ఎంతగానో పొందాయి. అదే తరహాలో కర్నూలు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో.. రుచికరమైన ఆహారాన్ని అందిస్తామని నిర్వాహకులు అంటున్నారు. దీనిని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న దూపాడులో ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహాకుడు దత్తత్రేయ తెలిపారు. ఈ రెస్టారెంట్ రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని యాజమాన్యం తెలిపింది. అయితే.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కెర్లు కొడుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..