AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. చంద్రబాబు అరెస్ట్‌పై వాడివేడిగా చర్చ జరిగే ఛాన్స్..!
AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్.. ఆ తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలతో.. ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. టీడీపీని ఇరుకున పెట్టేందుకు అధికార వైసీపీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంటే.. చంద్రబాబు అరెస్ట్‌తో పాటు.. ప్రజా సమస్యలపై గళం విప్పాలని టీడీపీ నిర్ణయించింది.
AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్.. ఆ తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలతో.. ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. టీడీపీని ఇరుకున పెట్టేందుకు అధికార వైసీపీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంటే.. చంద్రబాబు అరెస్ట్‌తో పాటు.. ప్రజా సమస్యలపై గళం విప్పాలని టీడీపీ నిర్ణయించింది. ఇవాళ ఉదయం 9 గంటలకు శాసనసభ,10 గంటలకు శాసనమండలి ప్రారంభంకానుంది. క్వశ్చన్ అవర్‌తో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజులు జరపాలనే దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 8.30కి వెంకటపాలెంలో NTR విగ్రహానికి నివాళులర్పించి టీడీపీ సభ్యులు బయలుదేరనున్నారు. అయితే, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ సభలో గళం వినిపించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అయితే, చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమవుతోంది..
ఇదిలాఉంటే.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం పలు బిల్లులు ప్రవేశపెట్టనుంది. దేవాదాయ చట్టంలో సవరణలు చేసే బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి కొట్టు సత్యన్నారాయణ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ ఆధార్ బిల్లును మంత్రి గుడివాడ అమర్నాధ్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీవీవీపీని రద్దు చేసే బిల్లును మంత్రి విడుదల రజిని ప్రవేశపెట్టనున్నారు. అసైన్డ్ ల్యాండ్స్ చట్ట సవరణలు చేసే బిల్లును మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టనున్నారు. జీఎస్టీ సవరణల బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి బుగ్గన ప్రవేశపెట్టనున్నారు. మొత్తం మీద ఈ సమావేశాల్లో 47 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.
ఓ వైపు స్కిల్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో.. వైసీపీ-టీడీపీ మధ్య మాటలయుద్ధం నడుస్తుంటే… మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలు… ఇరు పార్టీల మధ్య కాక రేపుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా సమావేశాలకు హాజరవుతుండటంతో అందరిలోనూ అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగనుందని ఉత్కంఠ మొదలైంది. ఇదిలాఉంటే.. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
టీడీపీ వర్సెస్ వైసీపీ..
అసెంబ్లీ సమావేశాలు మరింత హీటెక్కించనున్నాయి. చంద్రబాబు అవినీతిపై అసెంబ్లీ వేదికగా… ప్రజలకు తెలియజేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. స్కిల్ స్కాంతో పాటు… ఇతర కుంభకోణాలపై రోజుకో అంశంతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తామని చెబుతున్నారు. ప్రజా ధనాన్ని చంద్రబాబు ఎలా లూటీ చేసారో ప్రజలకు వివరిస్తామని చెబుతున్నారు వైసీపీ నేతలు. అయితే, టీడీపీ కూడా ప్రభుత్వంపై ఎదురుదాడికి సిద్ధమవుతోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటున్న టీడీపీ.. ఇదే విషయాన్ని అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేస్తామని అంటోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసారని సభలో గళం విప్పుతామంటున్నారు టీడీపీ నేతలు.