AP Assembly: టీడీపీ హయాంలో డేటా చోరీ జరిగింది.. సంచలన విషయాలను వెల్లడించిన హౌజ్ కమిటీ చీఫ్ భూమన..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పెగాసస్, డేటా చోరిపై హౌజ్ కమిటీ నివేదిక ఇచ్చింది.

AP Assembly: టీడీపీ హయాంలో డేటా చోరీ జరిగింది.. సంచలన విషయాలను వెల్లడించిన హౌజ్ కమిటీ చీఫ్ భూమన..
Bhumana Karunakar Reddy
Follow us

|

Updated on: Sep 20, 2022 | 2:01 PM

AP Assembly session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పెగాసస్, డేటా చోరిపై హౌజ్ కమిటీ నివేదిక ఇచ్చింది. డేటా చోరీపై కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి (Bhumana Karunakar Reddy).. సభలో మధ్యంతర నివేదికను ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం హయాంలో డేటా చోరీ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. 30 లక్షలకుపైగా ఓటర్ల తొలగింపులో భాగంగానే డేటా చోరీ చేశారని, దీనికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. సేవా మిత్ర యాప్‌ ద్వారా ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారని, దీనిని దుర్వినియోగం చేసినట్లు వెల్లడించారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాలంటూ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. డేటా దొంగలను పట్టుకునేందుకు విచారణ చేస్తున్నామని.. త్వరలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. 2017-19, 2018-19 మధ్యకాలంలో ప్రైవేట్‌ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని తెలిపారు.

కాగా.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గత టీడీపీ హయాంలో చంద్రబాబు పెగాసస్ స్పై వేర్‌ను కొనుగోలు చేశారంటూ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపాయి. గత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై తీవ్రంగా చర్చ జరగగా.. అసెంబ్లీ హౌస్ కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ హౌస్‌ కమిటీకి చైర్మన్‌గా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు. దీంతోపాటు పలువురిని సభ్యులుగా నియమించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..