Loan Apps: లోన్‌ యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలి.. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఫ్రెండ్స్‌, బంధువులకు పంపడంతో..

Andhra Pradesh: కేసులైనా, అరెస్టులైనా డోంట్‌ కేర్‌ అంటున్నాయ్‌ లోన్‌ యాప్స్‌. చస్తే చావండి, మాకేంటి?. చచ్చినాసరే డబ్బు మాత్రం కట్టాల్సిందేనంటూ ఫ్యామిలీ మెంబర్స్‌పై పడుతున్నాయ్‌ లోన్‌ యాప్స్‌. తాజాగా లోన్‌ యాప్‌ ఆగడాలకు మరో ప్రాణం బలైపోయింది.

Loan Apps: లోన్‌ యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలి.. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఫ్రెండ్స్‌, బంధువులకు పంపడంతో..
Loan Apps
Follow us
Basha Shek

|

Updated on: Sep 10, 2022 | 7:28 AM

Andhra Pradesh: కేసులైనా, అరెస్టులైనా డోంట్‌ కేర్‌ అంటున్నాయ్‌ లోన్‌ యాప్స్‌. చస్తే చావండి, మాకేంటి?. చచ్చినాసరే డబ్బు మాత్రం కట్టాల్సిందేనంటూ ఫ్యామిలీ మెంబర్స్‌పై పడుతున్నాయ్‌ లోన్‌ యాప్స్‌. తాజాగా లోన్‌ యాప్‌ ఆగడాలకు మరో ప్రాణం బలైపోయింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో లోన్‌ యాప్‌ వేధింపులు భరించలేక యువకుడు శివ సూసైడ్‌ చేసుకున్నాడు. లోన్‌ యాప్‌ ద్వారా నాలుగు వేల రూపాయలు రుణం తీసుకున్న శివ, తిరిగి చెల్లించాడు. అయినా, ఇంకా పదహారు వేలు కట్టాలని వేధింపులకు దిగడంతో తట్టుకోలేకపోయాడు. ఫొటోలను మార్ఫింగ్‌చేసి బూతు ఫొటోలు, వీడియోలను బంధువులు, ఫ్రెండ్స్‌కి పంపడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు సూసైడ్‌ చేసుకోవడంతో తల్లడిల్లిపోతోంది కన్నతల్లి. ఆ డబ్బు కట్టేద్దామని చెప్పానని, కానీ వేధింపులు తట్టుకోలేక అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతోంది. శివ చచ్చినా సరే, తమ డబ్బు కట్టాల్సిందేనంటూ కుటుంబ సభ్యులపై వేధింపులకు దిగారన్నారు ఏపీ వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్ దేవళ్ల రేవతి.

కాగా.. లోన్ యాప్ వేధింపులపై సీఎం జగన్ స్పందించారు. రోజురోజుకు ఆగడాలు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం సీరియస్ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అనుమతి లేని లోన్‌ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నేరుగా నేరుగా సీఏం జగన్మోహన్ రెడ్డి అధికారులకు చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో లోన్ యాప్ వేధింపుల వల్ల ఎవరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..