AP Weather: ఏపీకి వర్షసూచన.. మరోవైపు వడగాలులు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే

‘మోచా’ తీవ్ర తుపానుగా మారింది. 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది కాక్స్‌ బజార్‌ (బంగ్లాదేశ్‌), క్యాక్‌ప్యూ (మయన్మార్‌) మధ్య ఈ నెల 14న మధ్యాహ్నం తీరాన్ని దాటవచ్చని వాతావనఫ శాఖ అధికారులు చెబుతున్నారు.

AP Weather: ఏపీకి వర్షసూచన.. మరోవైపు వడగాలులు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే
Andhra Weather Report
Follow us

|

Updated on: May 12, 2023 | 8:27 AM

కూల్ న్యూస్ చెప్పింది వెదర్ డిపార్ట్‌మెంట్. వచ్చే 3 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు టెంపరేచర్స్  2 నుంచి 4 డిగ్రీల వరకు పెరుగుతాయని, పౌరులు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు. గురువారం అనంతపురం జిల్లా శెట్టూరులో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీ వ్యాప్తంగా శుక్రవారం 60 మండలాల్లో వడగాలులు వీచే చాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.  రానున్న ఐదు రోజులు కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులకు అవకాశం ఉందని పేర్కొంది.

14న తీరం దాటనున్న తుపాను

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను ‘మోచా’ తీవ్ర తుపానుగా మారింది. ప్రజంట్ ఇది గంటకు 11 కిలోమీటర్ల వేగంతో సాగుతోంది. గురు­వారం రాత్రికి పోర్టుబ్లెయిర్‌కు పశ్చిమంగా 520, మయన్మార్‌లోని సిట్వేకు దక్షిణ నైరుతి దిశగా 1020 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ‘మోచా’ తుపాను ఆగ్నేయ బంగ్లాదేశ్‌, ఉత్తర మయన్మార్‌ మధ్యలో కాక్స్‌ బజార్‌ వద్ద మే 14న తీరం దాటే అవకాశముందని ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందన్నారు.

ఏలూరులో గాలివాన బీభత్సం సృష్టించింది. భీమడోలు, ద్వారకాతిరుమలలో ఈదురుగాలులు వీచాయి.  120కు పైగా విద్యుత్‌ స్తంభాలు నేల కూలాయి. మూడు గ్రామాల్లో 2 రోజులపాటు విద్యుత్‌కు అంతరాయం కలిగింది. గాలివాన బీభత్సానికి ఎక్కడికక్కడ చెట్లు నేలకూలాయి. పి.కన్నాపురంలో చెట్టుకొమ్మ పడి ఆదిలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. ఈదురుగాలులకు పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ గాలులకు ఆటోలు కాలువలో కొట్టుకుపోయాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..