Andhra Pradesh: ఏపీ ప్రజలకు అలెర్ట్.. భూమిపై నేరుగా పడుతున్న సూర్యకిరణాలు.. ఎందుకంటే?

| Edited By: Srilakshmi C

Aug 14, 2023 | 5:20 PM

ఏపీ వ్యాప్తంగా గత పది రోజులుగా ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే మూడు నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతతో ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. అవి మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. అంతే కాకుండా దీనికి ఉక్కపోత కూడ తోడవనుంది. దీనికి ప్రధాన కారణం వాతావరణంలోని ఏర్పడ్డ మార్పులే అంటున్నారు..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అలెర్ట్.. భూమిపై నేరుగా పడుతున్న సూర్యకిరణాలు.. ఎందుకంటే?
Sun is Burning in AP
Follow us on

అమరావతి, ఆగస్టు 14: ఏపీలో మొన్నటివరకు ముంచెత్తిన వానా కాస్తా ఇప్పుడు కనుమరుగైపోయింది. వర్ష కాలంలో కూడా ఎండాకాలంకు మించిన రేంజ్ లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోయాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. దీనికి కారణం ఏపీలో సూర్యకిరణాలు భూమిపై నేరుగా పడటమే అంటున్నారు వాతావరణ నిపుణులు.

ఏపీ వ్యాప్తంగా గత పది రోజులుగా ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే మూడు నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతతో ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. అవి మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. అంతే కాకుండా దీనికి ఉక్కపోత కూడ తోడవనుంది. దీనికి ప్రధాన కారణం వాతావరణంలోని ఏర్పడ్డ మార్పులే అంటున్నారు.

సాధారణంగా అయితే మే నుంచి ఆగష్టు వరకు ఆంధ్రప్రదేశ్ వాతావరణం పై సోలార్ రేడియేషన్ ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. అయితే, భూమి ఉపరితలం పైకి వచ్చే సూర్యకిరణాల ప్రసరణ వర్షాకాలంలో ఉండే మేఘాల కారణంగా వేసవితో పోలిస్తే ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీ పైభాగంలో మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్యుడి నుంచి నేరుగా కిరణాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి అసౌకర్యంతో కూడిన వాతావరణం ఉంటుంది. దీని ప్రభావం మే నెల వరకు ఉంది కాబట్టి ఈ అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.