AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ 3,692 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 29 మంది మృతి..
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ..
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. తాజాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 94,595 సాంపిల్స్ సేకరించి కరోనా టెస్ట్ చేయగా వీరిలో 3,175 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,692 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఆరుగురు చనిపోయారు. ఇక కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, కర్నూలులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, గుంటూరులో ఒక్కరు, కడపలో ఒక్కరు, నెల్లూరులో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 35,325 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 3.3 శాతంగా ఉంది. మరణాల రేటు 0.67 శాతం, రికవరీ రేటు 97.5 శాతంగా ఉంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 662 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇదిలాఉంటే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,23,63,078 శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయగా.. 19,02,923 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 18,54,754 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక 12,844 మంది వైరస్ ప్రభావంతో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితేనే తప్ప ఎవరూ బయటకు వెళ్లవద్దని, వెళ్లినా.. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలని ఏపీ కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ రాష్ట్ర ప్రజలను కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం – 137, చిత్తూరు – 473, తూర్పుగోదావరి – 662, గుంటూరు – 215, కడప – 181, కృష్ణా – 210, కర్నూలు – 59, నెల్లూరు – 235, ప్రకాశం – 322, శ్రీకాకుళం – 79, విశాఖపట్నం – 142, విజయనగరం – 62, పశ్చిమ గోదావరి – 398 చొప్పున మొత్తం రాష్ట్రంలో 3,175 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Also read:
రెండేళ్ల పాలనలో 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా మీలో చలనం లేదా.? నారా లోకేష్