AP Schools: ఏపీలో ఒంటిపూట బడుల షెడ్యూల్ వచ్చేసిందోచ్.. కానీ ఆ స్కూళ్లకు సెలవులు..

ఏపీ విద్యార్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒంటిపూట బడుల షెడ్యూల్ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు..

AP Schools: ఏపీలో ఒంటిపూట బడుల షెడ్యూల్ వచ్చేసిందోచ్.. కానీ ఆ స్కూళ్లకు సెలవులు..
Follow us

|

Updated on: Apr 01, 2023 | 12:28 PM

ఏపీ విద్యార్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒంటిపూట బడుల షెడ్యూల్ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 3 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు ఉండనున్నాయి.

అటు రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 18 వరకు పదో తరగతి పరీక్షలు ఉంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. ఈ ఏడాది నుంచి 6 పేపర్ల విధానంలో పరీక్షలు నిర్వస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల 9 వేల 70 మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌కు హాజరు కానున్నారని.. వీరిలో 3,11,329 బాలురు ఉండగా.. 2,97,741 మంది బాలికలు ఉన్నారని చెప్పారు.

ఈ విద్యార్ధులకు పరీక్షా కేంద్రానికి ఉచిత బస్సు ప్రయాణం అని క్లారిటీ ఇచ్చారు. అటు పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్‌లకు అనుమతి లేదన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇక పైన పేర్కొన్న ఎగ్జామ్ సెంటర్లలోని 2,275 పరీక్షా కేంద్రాల్లో మద్యాహ్నం ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగుతాయన్నారు. మరోవైపు టెన్త్ క్లాసు పరీక్షలు జరిగే 3,349 పాఠశాలల్లో ఐదు రోజులు రెండుపూటలా సెలవులు ఉంటాయని తెలిపారు.