AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గంజాయిపై ఏపీ పోలీసుల ఉక్కుపాదం.. 2 కోట్ల విలువైన సరుకు కాల్చివేత..

Andhra Pradesh: రాష్ట్రంలో గంజాయి సరఫరాకు ఏపీ పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో 2021 నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తేలింది. ఏకంగా 2 లక్షల టన్నుల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో గంజాయి సరఫరాకు...

Andhra Pradesh: గంజాయిపై ఏపీ పోలీసుల ఉక్కుపాదం.. 2 కోట్ల విలువైన సరుకు కాల్చివేత..
Ap Govt
Narender Vaitla
|

Updated on: Sep 29, 2022 | 3:13 PM

Share

రాష్ట్రంలో గంజాయి సరఫరాకు ఏపీ పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో 2021 నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తేలింది. ఏకంగా 2 లక్షల టన్నుల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో గంజాయి సరఫరాకు కళ్లెం వేయడానికి ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు ధృడ నిశ్చయంతో ఉన్నారు. దీనికి నిదర్శనమే స్శాధీనం చేసుకున్న గంజాయి అని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా దేశంలోనే తొలిసారి భారీ మొత్తం గంజాయిని స్వాధీనం చేసుకొని, ఆంధ్రప్రదేశ్ లో మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ వైపు గంజాయి సరఫారకు అడ్డుకట్టవేస్తూనే మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇందులో భాగంగానే విశాఖపట్నం ఏజెన్సీలో గంజాయి సాగు చేస్తున్న ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ పేరుతో పోలీసులు ఓ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. పోలీసులు, ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్‌లు సంయుక్తంగా ఆ ఆపరేషన్‌ను చేపట్టారు. ట్రైబల్‌ బెల్ట్‌లోని 92 గ్రామాల్లో సుమారు 2వేల ఏకరాల్లో సాగు చేస్తున్న గంజాయి సాగును అధికారులు ధ్వంసం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక తాజాగా ఏపీ పోలీసులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 2 లక్షల కిలోల గంజాయిని కాల్చి బూడిద చేశారు. 1500 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 562 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్హం. ఇక 47,986.934 కిలోల గంజాయి, 46.41 లీటర్ల ఆషిష్‌ ఆయిల్‌, 314 వాహనాలు సీజ్‌ చేశారు. అలాగే 7552 ఎకరాల్లో ఉన్న గంజాయి సాగును పోలీసులు ధ్వంసం చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 1963 అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేయడానికి 120 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు. ఇలా ఏపీలో అధికారులు, ప్రభుత్వం గంజాయిని రూపుమాపేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..