ఏపీ పంచాయతీ పోరుః ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ నిబంధనలు తప్పనిసరి..!
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు.

AP Election candidates eligibility: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలా వద్దా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య సమరమే నడిచింది. చిట్ట చివరికి సుప్రీంకోర్టు తీర్పు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనె 29 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించింది ఎస్ఈసీ. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. మరి పోటీ చేయాలంటే అర్హతలు ఏంటి?.. అర్హులు ఎవరు? అనర్హులు ఎవరు?. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
పంచాయతీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు
- గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు.. ఏ పంచాయతీ పరిధిలో బరిలోకి దిగుతున్నారో.. అక్కడ ఓటర్ల జాబితాలో వారి పేరు నమోదు చేసి ఉండాలి.
- అభ్యర్థుల వయసు నామినేషన్ల పరిశీలన నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి.
- ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వారికి రిజర్వు చేసిన స్థానాల్లోనే కాకుండా అన్‌రిజర్వుడు స్థానాల నుంచి పోటీ చేయొచ్చు.
- మహిళా అభ్యర్థులు అదే కేటగిరిలో జనరల్ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు.
- ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు పోటీ చేసేందుకు అనర్హులు. (1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అమలు తేదీ నుంచి ఏడాది లోపు జన్మించిన అదనపు శిశువును పరిగణనలోకి తీసుకోకూడదు. ఈ చట్టం అమలు తేదీ నాటికి ఒక వ్యక్తికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండొచ్చు.)
- ప్రభుత్వ ఉద్యోగులు, పాలక మండలి సభ్యులు అనర్హులు.
- నేరాలు చేసి రుజువై శిక్ష పడినవారు అనర్హులు. శిక్షా కాలం ముగిసిన నాటి నుంచి ఐదేళ్లపాటు పోటీకి ఛాన్స్ లేదు.
- గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్టు చేసుకున్న, ఏదైనా పనికి నిర్వహణ ఒప్పందం చేసుకున్న వ్యక్తులు అనర్హులు.
- మతి స్థిమితం లేని వారు, బధిరులు, మూగవారు అనర్హులు. వీ
- పౌర హక్కుల పరిరక్షణ చట్టం-1955 పరిధిలోకి వచ్చే నేరాల్లో శిక్షపడినవారు కూడా అనర్హులే.
Read Also… నేటి నుంచే తొలి ఘట్టం.. ఏపీ పంచాయతీ పోరుకు అంతా సిద్ధం.. మొదలైన నామినేషన్ల స్వీకరణ