AP Municipal Elections: ఏపీలో నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు..
AP Elections: పెండింగ్ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు ఛాన్స్ఉండగా..

AP Elections: పెండింగ్ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు ఛాన్స్ఉండగా.. 3 గంటల తర్వాత పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. నెల్లూరు కార్పొరేషన్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించనున్నారు.
పోటీలో ఉన్న అభ్యర్థుల మరణించడం, వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నవంబర్ 3వ తేదీన ప్రకటించింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 498 గ్రామ పంచాయతీలు, 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో 69 సర్పంచ్‌లు, 533 వార్డు సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, మున్సిపల్ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం.. నవంబర్ 5 వరకు నామినేషన్ల సమర్పణకు గడువు ఇచ్చింది.
నవంబర్ 6న ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు చివరి తేదీ అని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్నికల అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 14న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ లలో నవంబర్ 15న పోలింగ్ నిర్వహించి.. 17న ఫలితాలు ప్రకటిస్తారు. గతంలో రద్దయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 16న పోలింగ్ నిర్వహించి నవంబర్ 18న ఫలితాలు వెల్లడిస్తారు.
Also read:
PM Narendra Modi: అన్ని రకాలుగా ఆదుకుంటాం.. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ..